ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న #SSMB28

సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కలయికలో #SSMB28 మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే షూటింగ్ మొదలుపెట్టిన మేకర్స్..ప్రస్తుతం మొదటి షెడ్యూల్ ను విజవంతంగా పూర్తి చేసారు. రెండో షెడ్యూల్ దసరా తర్వాత ప్లాన్ చేసారు. ఈ ఫస్ట్ షెడ్యూల్ లో మహేష్ బాబు కూడా పాల్గొన్నారు. ప్రముఖ స్టంట్ కొరియోగ్రఫీ ట్విన్స్ ‘అన్బరివ్’ (అన్బుమణి-అరివుమణి) ద్వయం పర్యవేక్షణలో కొన్ని హై ఓల్టేజ్ యాక్షన్ దృశ్యాలను చిత్రీకరించారు. రెండో షెడ్యూల్ లో మహేష్ బాబుతో పాటు హీరోయిన్ పూజా హెగ్డేపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

ఈ మేరకు నిర్మాత నాగవంశీ ట్వీట్ చేశారు. త్వరలోనే మరిన్ని అప్ డేట్స్ వెల్లడిస్తానని తెలిపారు. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేశ్-త్రివిక్రమ్ కలయికలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. పన్నెండేళ్ల తర్వాత ఈ కాంబోలో ఓ చిత్రం సెట్స్ మీదకు వచ్చింది. ఈ చిత్రంలో మహేశ్ బాబు లుక్ కొత్తగా ఉండడం అభిమానుల్లో మరింత ఆసక్తి కలిగిస్తోంది. వచ్చే సమ్మర్ లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రాన్ని హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ నిర్మిస్తుండగా , థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.