ఇంకా హాటీ నాటీ

Sriya
Sriya

పెళ్లి తర్వాత శ్రీయ సీను ఇదీ. ప్రియుడు ఆండ్రూ కోశ్చీవ్ ని పెళ్లాడాక కొత్త కాపురంలో సరిగమల్ని ఆస్వాధిస్తోంది. దేశ – విదేశాల్లో హుషారుగా షికార్లు చేస్తూ జీవితాన్ని సార్థకం చేసుకుంటోంది. ఆండ్రూ చెయ్యి తిరిగిన టెన్నిస్ క్రీడాకారుడు కాబట్టి శ్రీయతో ప్రేమాటలోనూ అంతే తలపండిపోయాడు.

ఆ ఆట మాటేమో కానీ ప్రస్తుతం టాలీవుడ్లో ఛాన్సు పట్టేయాలంటే ఏం చేయాలి? .. ఇదే ఆలోచనలతో శ్రీయ సతమతమవుతోందిట. సౌత్ లో దశాబ్ధం పైగానే స్టార్ డమ్ ని  ఆస్వాధించిన శ్రీయ ఇప్పటికీ తొలినాళ్లలో ఫిట్ నెస్ – ఫిజిక్ మెయింటెయిన్ చేస్తూ దర్శకనిర్మాతల కనుపాపలపై నిదురిస్తోంది. చిరంజీవి – బాలయ్య – వెంకీ – నాగ్ .. ఎవరో ఒకరు ఆప్షన్ ఇవ్వకపోరని ఎదురు చూస్తోందిట. చూద్దాం.. శ్రీయ కలలు ఎంతవరకూ ఫలిస్తాయో!