భర్త తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న శ్రీయ

భర్త తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న శ్రీయ

సినీ నటి శ్రీయ కుటుంబ సమేతంగా మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్న శ్రియ దంపతులను ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందచేశారు. అనంతరం శ్రీయ మీడియాతో మాట్లాడుతూ.. కోవిడ్ కారణంగా రెండు సంవత్సరాలుగా స్వామివారిని దర్శించుకోలేకపోయానని అన్నారు. ఇక ఆమె భర్త ఆండ్రీ ఆలయం ముందు శ్రియకి ముద్దు పెట్టి తన ప్రేమను వ్యక్తపరిచారు.

ఇష్టం మూవీ తో 2001 లో తెలుగు ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన శ్రీయ..అగ్ర హీరోలతో పాటు యంగ్ హీరోల సరసన కూడా జోడి కట్టి ప్రేక్షకులను అలరించింది. ఇండస్ట్రీ లో అడుగుపెట్టి దాదాపు రెండు దశాబ్దాలు కావొస్తున్నా ఇంకా సినిమా ఛాన్సులు దక్కించుకుంటూనే ఉంది. కేవలం సినిమాలతోనే కాదు సోషల్ మీడియా లోను ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. ప్రస్తుతం శ్రియ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (రౌద్రం రణం రుధిరం)లో అజయ్‌ దేవగణ్‌కు జోడీగా నటిస్తుంది. అలాగే ‘గమనం’ అనే మల్టీలాంగ్వేజ్‌ చిత్రంలో నటిస్తుంది..