నేడు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల విడుదల

తిరుమల: తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఇవాళ శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల చేయనుంది. నవంబర్, డిసెంబర్ నెలలకు సంబంధించిన 300 రూపాయల టికెట్లను ఉదయం 9 గంటల నుంచి అందుబాటులోకి తీసుకురానుంది. రోజుకు 12వేల చొప్పున టికెట్లు ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచాల‌ని టీటీడీ నిర్ణ‌యించింది.

శ‌నివారం నుంచి సర్వదర్శనం టికెట్లు అందుబాటులోకి రానుండగా రోజుకు 10వేల చొప్పున టికెట్లు విడుదల చేయనున్నారు. ఇక నవంబర్ నెలకు సంబంధించిన గదుల బుకింగ్ ను ఈనెల 25 నుంచి అందుబాటులో ఉంచ‌నున్న‌ట్టు తెలిపింది తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం బోర్డు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/