నేటి నుండి శ్రీవారి దర్శనం నిలిపివేత

ద్వారకాతిరుమల ఆలయం కూడా మూసివేత

tirumala temple
tirumala temple

తిరుపతి: కరోనా వైరస్‌ పలు ఆలయాలపై తన పంజా విసురుతుంది. ఈవైరస్‌ వ్యాప్తి నియంత్రణలో భాగంగా తిరుమల శ్రీవారి దర్శనాన్ని, ఆర్జిత సేవలను వారం రోజులపాటు తాత్కాలికంగా నిలిపివేస్తూ టిటిడి నిర్ణయం తీసుకుంది. ఈమేరకు టిటిడి నిర్ణయాలను కార్యనిర్వాహక అధికారి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో నిర్వహించని విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పరిస్థితిని సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు.
మరోవైపు చినతిరుపతిగా భక్తులు చెప్పుకునే పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల ఆలయాన్ని కూడా మూసివేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కరోనా విస్తరణ కట్టడి దృష్ట్యా దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు మధ్యాహ్నం నుంచి ఆలయంలోకి భక్తులను అనుమతించరాదని నిర్ణయించారు. ఇప్పటికే ఆర్జిత సేవలను రద్దు చేశారు. తాజాగా భక్తుల దర్శనంతోపాటు కేశఖండనశాల, అన్నప్రసాద వితరణ కేంద్రాలు కూడా మూసివేయాలని నిర్ణయించారు. ఆన్ లైన్ టికెట్ల విక్రయాన్ని తాత్కాలికంగా నిలిపివేయనున్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/