సచిన్ నా పేరు చెప్పగానే ఏడుపొచ్చింది: శ్రీశాంత్

సచిన్ నా పేరు చెప్పగానే ఏడుపొచ్చింది: శ్రీశాంత్
న్యూఢిల్లీ: భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఓ ఇంటర్వ్యూలో తన పేరు చెప్పగానే ఏడుపొచ్చిందని వివాదాస్పద ఫాస్ట్ బౌలర్ ఎస్ శ్రీశాంత్ వెల్లడించాడు. సల్మాన్‌ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న హిందీ బిగ్‌బాస్ సీజన్ 12లో ప్రస్తుతం కంటెస్టెంట్‌గా ఉన్న శ్రీశాంత్…తాను తీవ్ర భావోద్వేగానికి గురైన సందర్భాన్ని హౌస్‌లోనే తోటి కంటెస్టెంట్స్‌తో చెప్పుకొచ్చాడు. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్‌ని గెలిచిన భారత జట్టులో శ్రీశాంత్ సభ్యుడిగా ఉన్న విషయం తెలిసిందే. అయితే…2013లో ఐపిఎల్ స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో శ్రీశాంత్‌పై బిసిసిఐ జీవితకాల నిషేధం విధించింది. 2011 ప్రపంచకప్ ముగిసిన ఏడాది తర్వాత అనుకుంటా…ఓ ఇంటర్వ్యూలో భారత్ జట్టు ప్రపంచకప్‌లో ఆడిన తీరు గురించి ప్రశంసించారు. ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి…జట్టులోని ఆటగాళ్లందరి కృషిని పొగిడాడు. ఒక్క నా గురించి తప్ప…!ఇక ఇంటర్వ్యూ ముగుస్తుందన్న దశలో సచిన్ టెండూల్కర్ చొరవ తీసుకుని టీమి ండియా ప్రపంచకప్ గెలవడంలో శ్రీశాంత్ కూడా క్రియాశీలక పాత్ర పోషించాడని చెప్పాడు. ఆ మాటలు విని నాకు చాలా ఏడుపొచ్చిందని శ్రీశాంత్ గుర్తు చేసుకున్నాడు. జూలై 2015లో పాటియాల కోర్టు శ్రీశాంత్‌ని నిర్ధోషిగా ప్రకటిం చినా…బిసిసిఐ మాత్రం అతనిపై నిషేధం వేటుని ఎత్తివేసేందుకు అంగీకరించలేదు. ఆతర్వాత…ఈ ఏడాది కేరళ హైకోర్టు కూడా శ్రీశాంత్‌పై నిషేధం ఎత్తివేయాలని ఆదేశించినా…బిసిసిఐ మళ్లీ పిటిషన్ దాఖలు చేసింది తప్ప నిషేధాన్ని ఎత్తివేయలేదు.