ఒక్క రోజులో 6 అడుగుల నీటిమట్టం

Srisailam Project
Srisailam Project

Srisailam: శ్రీశైలం ప్రాజెక్టులో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఒక్క రోజులో శ్రీశైలం జలాశయం నీటిమట్టం ఆరు అడుగులకు పెరిగింది.  నిన్న ఉదయం జలాశయంలో 804 అడుగుల వరకూ నీరుండగా, వరద నీటి రాక ప్రారంభం కావడంతో, ఈ ఉదయం 810 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. జూరాల నుంచి వస్తున్న వరద నీటితో శ్రీశైలం జలాశయం శరవేగంగా నిండుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు  ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలకు వస్తున్న నీటిని దిగువకు విడుదల చేయడం, మరోవైపు జూరాల రిజర్వాయర్ నుంచి 1,76,824 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలానికి ఇన్ ఫ్లోగా వచ్చిచేరుతోంది. దీంతో శ్రీశైలం జలాశయంలో భారీగా వరద నీరు చేరుతోంది.  శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు ఉంది.