శ్రీశైలం ప్రాజెక్టు వరద

Srisailam project
Srisailam project

SriSailam (Kurnool Dist.) కర్నూలు జిల్లాలో శ్రీశైలం ప్రాజెక్టు వరద పోటెత్తుతోంది. ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతుండడంతో అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి దిగువకు వరద నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టులోకి 6,97,036 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా, 7,48,168 క్యూసెక్కుల వరద నీటిని ఔట్‌ఫ్లో ద్వారా దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 881.10 అడుగులు ఉంది.