నేడు తెరచుకోనున్న శ్రీశైలం గేట్లు

Srisailam dam
Srisailam dam

శ్రీశైలం: భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద నీరు పోటెత్తుతోంది. దాదాపు 3,59,867 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. శ్రీశైలం ప్రస్తుత నీటి మట్టం 879.30 అడుగులకు చేరింది.దీంతో సాయంత్రం 5 గంటలకు ఏపీ జలవనరుల శాఖమంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ మూడు గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. జలాశయ పూర్తిస్థాయి సామర్థ్యం 215.81 టీఎంసీలకుగానూ ప్రస్తుత నీటి నిల్వ 184.27 టీఎంసీలుగా నమోదైంది.కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 800 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 42,378 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 32,272 క్యూసెక్కులు, హంద్రీనీవా ప్రాజెక్టుకు 1351 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/