శ్రీశైలం గేట్లు ఎత్తివేత

 

Srisailam
– ఉదయం నాలుగు గేట్ల ద్వార, సాయంత్రం మరో రెండు గేట్లు ద్వార నీటి విడుదల
Srisailam1
– నీటి విడుదలకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించ్తిన మంత్రి  దేవినేని 

శ్రీశైలం గేట్లు ఎత్తివేత

శ్రీశైలం ప్రాజెక్టు, :  కర్నూలు జిల్లా శ్రీశైలం జలాశయం నుంచి శనివారం ఉదయం నాలుగు రేడియల్‌ క్రస్ట్‌గేట్ల నుంచి 1,05,140 క్యూసెక్కుల నీటిని దిగువ నాగార్జునసాగర్‌కు ఏపి జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విడదల చేశారు. ముందుగా జలాశయం వద్దకు చేరుకున్న మంత్రికి సిఇ నారాయణరెడ్డి, ఎస్‌ఇ వీర్రారాజు పుష్పగుచ్చం ఇచ్చి సాదర స్వాగతం పలికారు. అనంతరం జలాశయం వద్దకు మేళాతాళలతో ఘనంగా ఆహ్వానించారు. జలాశయం వద్ద అర్చక స్వాములు శాస్త్రక్తోంగా గంగమ్మకు పూజలు నిర్వహించారు. అనంతరం 6వ నెంబర్‌ క్రస్ట్‌గేటును మంత్రి స్విచ్‌ ఆన్‌చేసి నీటిని దిగువకు విడుదల చేశారు. వరుసగా 7,8,5 రేడియల్‌ క్రస్ట్‌గేట్ల ద్వార కూడా నీటిని విడుదల చేశారు. అదే విధంగా ఒక్కొక్క క్రస్ట్‌గేటును 10 అడుగుల మేరకు ఎత్తు తెరచారు. ఒక క్రస్ట్‌గేటు ద్వార 26,285 క్యూసెక్కుల నీరు విడుదల అవుతుంది. మొత్తం 4 క్రస్ట్‌గేట్ల ద్వార మొత్తం 1,05,140క్యూసెక్కుల నీటిని దిగువ సాగర్‌కు వెళుతోంది. అనంతరం మంత్రి గంగమ్మకు పసుపు, కుంకుమ, గాజులు, సారె సమర్పించి, గంగమ్మకు హారతులు, వాయనం ఇచ్చారు. శ్రీశైలం ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి ఇన్‌ప్లో 3,68,146క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. నీటి విడదల స్పిల్‌వే, విద్యుత్‌ ఉత్పత్తితో ద్వార 2,08,997 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయానికి కొనసాగుతున్న వరద నీటి ప్రవాహ వేగాన్ని దృష్టిలో పెట్టుకుని నీటి విడుదల కొనసాగుతుందని ఇంజనీర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీశైల డ్యాం ఇంజనీర్లు సాంభశివారెడ్డి, వరహాలరావు, సేనానంద్‌, డిఇలు,ఏఇలు, శ్రీశైలం దేవస్థానం అధికారులు ఏఇఓ రాజశేఖర్‌, పిఆర్‌ఓ శ్రీనివాసరావు, ఆలయ పర్యవేక్షుకులు హరిదాసు తదితరులు పాల్గొన్నారు.

సాయంత్రం ఆరు క్రస్ట్‌గేట్ల నుంచి నీటివిడుదల : శ్రీశైల జలాశయానికి వరద నీరు పోటెత్తడంతో శనివారం సాయంత్రం మరో 2 గేట్లు 10 అడుగుల మేర ఎత్తు పెంచి తెరచి మొత్తం 6 రేడియల్‌ క్రస్ట్‌గేట్ల ద్వార నీటి విడుదల చేశారు. అదే విధంగా క్రస్ట్‌గేట్టు 6 నుండి 1,59,636క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అలాగే కుడి విద్యుత్‌ కేంద్రం నుంచి 30,679క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్‌ కేంద్రం నుంచి 42,378క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడుకు 26,000 క్యూసెక్కులు, కల్వకుర్తికి 2,400క్యూసెక్కులు, హంద్రీ-నీవాకు 2,025క్యూసెక్కులు, శ్రీశైలం స్పిల్‌వే గుండా 1,59,636క్యూసెక్కుల నీరు, మొత్తం 2,63,318క్యూసెక్కులు జలాశయం నుంచి దిగువ సాగర్‌కు విడుదల చేశారు. ఈ క్రమంలోనే జలాశయానికి జూరాల స్పిల్‌వే గుండా 96,332క్యూసెక్కులు, పవర్‌ హౌస్‌ ద్వార 40,000 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 1,85,220క్యూసెక్కులు, మొత్తం 3,15,552క్యూసెక్కులు శ్రీశైలం జలాశయానికి సాయంత్రం 5 గంటల సమయానికి ఇన్‌ఫ్లో కొనసాగుతుంది. శ్రీశైలం డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా డ్యాం నీటినిల్వ సామర్థ్యం 215.807 టిఎంసిలుగా నమోదైంది. ప్రస్తుత నీటిమట్టం 881.80 అడుగులుగా ఉండగా, నీటినిల్వ సామర్థ్యం 197.9120 టిఎంసిలుగా నమోదైంది. శ్రీశైలం ఎగువ పరీవాహక ప్రాంతల నుంచి వచ్చిచేరే నీటిని దృష్టిలో ఉంచుకుని జలవనురులశాఖ అధికారులు క్రస్ట్‌గేట్ల ఎత్తటం, తగ్గించటం చేస్తామని పేర్కొన్నారు.