శ్రీశైలం డ్యామ్‌ 10 గేట్లు ఎత్తివేత

srisailam-dam
srisailam-dam

కర్నూల్‌: తూర్పు కర్ణాటక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు మరోసారి కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. ఇప్పటికే ఆల్మట్టి, నారాయణపూర్‌, జూరాల ప్రాజెక్టులో నీరు పూర్తి స్థాయిలో నిండిపోయి ఉండటంతో, వచ్చిన నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ నేపథ్యంలో శ్రీశైలం జలాశయానికి వస్తున్న వరదనీరు మరింతగా పెరుగగా, జలాశయం సంబంధించిన 10 గేట్లను అధికారులు ఎత్తారు. శ్రీశైలం ఇన్‌ప్లో 2.36 లక్షలు కాగా…ఔట్‌ప్లో 3.47లక్షల క్యూసెక్యులుగా ఉంది. శ్రీశైలం జలాశయం నిండటంతో నీటిని నాగార్జున సాగర్‌కు వదులుతున్నారు. దీనివల్ల సాగర్‌కుడా నిండిపోయింది కాబట్టి శ్రీశైలంతో పాటు నాగార్జునసాగర్‌ జలాశయానికి సంబంధించిన 8 గేట్లను ఎత్తారు. సాగర్‌ ఇన్‌ప్లో 3.47లక్షలు కాగా ఔట్‌ప్లో 2.66లక్షలు క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలంలో జలాశయంలో మిగిలిన నీటిలో 68 క్యూసెక్కుల నీటిని కుడి,ఎడమ జల విధ్యుత్‌ కేంద్రాల ద్వారా దిగువకు వదులుతున్నారు.

తాజా జాతీయ వార్తలకోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/