డైరెక్టర్ శ్రీనువైట్ల ఎమోషనల్ ట్వీట్

డైరెక్టర్ శ్రీనువైట్ల పేరు గత వారం రోజులుగా మీడియా లో వైరల్ గా మారింది . దీనికి కారణం ఆయన భార్య విడాకుల కోసం కోర్ట్ మెట్ల ఎక్కడమే. ‘నీకోసం’ సినిమాతో దర్శకుడిగా చిత్రసీమలో ఎంట్రీ ఇచ్చిన శ్రీనువైట్ల.. ఆ తర్వాత ఆనందం, సొంతం, వెంకీ, దుబాయ్​ శీను, ఢీ, రెడీ, కింగ్​, దూకుడు, బాద్ షా వంటి వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో అతి తక్కువ టైం లోనే అగ్ర డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఆగడు చిత్రం శ్రీనువైట్ల విజయాలకు బ్రేక్ వేసింది.

ఈ సినిమా ప్లాప్ తర్వాత బ్రుస్ లీ , మిస్టర్, అమర్ అక్బర్ ఆంథోనీ ఇలా మూడు సినిమాలు ప్లాప్ కావడం తో ప్రస్తుతం సినీ కెరియర్ కాస్త వెనుకపడింది. ఈ తరుణంలో ఆయన భార్య రూప వైట్ల విడాకుల కోసం కోర్ట్ మెట్లు ఎక్కడ వైరల్ గా మారింది. దీనికి పలు కారణాలనే వార్తలు వినిపిస్తున్నాయి. అవి ఎంత నిజమో తెలియదు.

తాజాగా సోషల్ మీడియా వేదిక గా శ్రీను వైట్ల ఎమోషనల్ ట్వీట్ చేసారు. “జీవితం చాలా అందమైంది. కానీ నచ్చిన వాళ్లతో ఉంటే ఆ జీవితం మరింత అందంగా ఉంటుంది. ఈ ముగ్గురూ(కూతుర్లు) లేకుండా నా జీవితాన్ని ఊహించుకోలేను అంటూ కూతుర్లపై తనకున్న ప్రేమను తెలియజేస్తూ.. వారితో కలిసి దిగిన ఫొటోను పోస్ట్​ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్​ వైరల్​గా మారింది. ఈ ట్వీట్ కు అభిమానులు పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నారు.