కేసీఆర్ కాళ్లు ఒక్కసారి కాదు వంద సార్లు మొక్కుతా – తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు

తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు..ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్లు మొక్కడం వివాదాస్పదమైనా సంగతి తెలిసిందే. దీనిపై ఆయన స్పందిస్తూ..కేసీఆర్ కాళ్లు ఒక్కసారి కాదు వంద సార్లు మొక్కుతా అని అన్నారు. క‌రోనా నేప‌థ్యంలో మీడియా ముందుకు వస్తూ ప్రజలకు జాగ్రత్తలు చెపుతూ సుపరిచితమైన శ్రీనివాస్..ఆ మధ్య ఓ విచిత్రమైన పూజలు పాల్గొని వార్తల్లో నిలిచారు. గ‌త కొంత కాలంగా కొత్తగూడెం, ఖ‌మ్మం ప‌రిధిలో పర్యటిస్తూ మీడియాలో నిలుస్తున్న అయన..తాజాగా సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కతూ మీడియా లో వైరల్ గా మారారు. గత కొన్ని రోజులుగా సీఎం కేసీఆర్‌ కు సన్నిహితంగా ఉంటూ…వస్తున్న శ్రీనివాస రావు.. కేసీఆర్‌ కాళ్లు మొక్కతు కనబడటం హాట్‌ టాపిక్‌గా మారింది. టీఆర్ఎస్‌ భవన్‌ లో ఈ సంఘటన చోటు చేసుకుంది.
దీనిపై పెద్ద ఎత్తున సోషల్ మీడియా లో చర్చ గా మారగా..శ్రీనివాస్ రావు క్లారిటీ ఇచ్చారు.

“సీఎం కేసీఆర్‌ పాదపద్మాలకు నమస్కరించా. అవును.. ఒక్కసారి కాదు బరాబర్ వంద సార్లు నమస్కరిస్తా. ఆయనకు పాదాభివందనం చేయడాన్ని కొందరు కావాలని రాద్ధాంతం చేస్తున్నారు. ఒక్కసారి కాదు వందసార్లైనా ఆయన కాళ్లు మొక్కుతా. సీఎం కేసీఆర్‌ నాకు తండ్రి సమానులు. బంగారు తెలంగాణ దిశగా సాగుతున్న పాలనా దక్షుడు. ఆయన పాదాలు తాకడం అదృష్టంగా భావిస్తా. తెలంగాణకు మరో బాపూజీ సీఎం కేసీఆర్. భద్రాద్రి కొత్తగూడెం ప్రజల కోసం ఒక కొత్త వైద్యశాల నిర్మించినందుకు ఆయన కాళ్లు మొక్కుతా.” అంటూ డీహెచ్‌ శ్రీనివాసరావు ఉద్వేగంతో చెప్పుకొచ్చారు. తాను ఎంబీబీఎస్ చదువుకున్న సమయంలో ఉస్మానియాకు వెళ్లాల్సివచ్చిందని.. ఇప్పుడు భద్రాద్రిలోనే ఓ కాలేజీ ఉందన్నారు. మొదటి దశలో భద్రాద్రికి వైద్య కళాశాల లేకపోతే.. తానే స్వయంగా సీఎం కేటీఆర్‌ను అడిగానని.. ఆయన వెంటనే మంజూరు చేశారని డీహెచ్ గుర్తు చేశారు.