బార్ అండ్ రెస్టారెంట్ల విషయంలో తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం

బార్ అండ్ రెస్టారెంట్ల విషయంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. గతంలో మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రకటించినట్లే తాజాాగా బార్ అండ్ రెస్టారెంట్లలో కూడా రిజర్వేషన్లు కల్పిస్తామని అసెంబ్లీలో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు.

శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చారు. మ‌ద్యం షాపుల్లో గౌడ కుల‌స్తుల‌కు 15 శాతం, ఎస్సీల‌కు 10 శాతం, ఎస్టీల‌కు 5 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింద‌ని తెలిపారు. ఆర్థికంగా అభివృద్ధి చేయాల‌నే ఉద్దేశంతోనే రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తున్నాం. భార‌త‌దేశంలో గొప్ప విప్ల‌వాత్మ‌క‌మైన మార్పులు కేసీఆర్ తీసుకొచ్చారని మంత్రి శ్రీనివాస్ తెలిపారు. జిల్లాల వారీగా రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించి, నిష్ప‌క్ష‌పాతంగా కేటాయింపులు చేస్తామ‌న్నారు.

ప్రస్తుతం బార్లకు టెండర్ టైం దగ్గర పడుతోంది. అక్టోబర్ లోనే పాత లైసెన్సుల గడువు పూర్తి కావాల్సింది. కానీ కరోనా కారణంగా రెండుసార్లు లాక్డౌన్ రావడంతో బార్ల నిర్వహకులకు కొంతమేర లాస్ ఏర్పడింది. దీంతో గడువును మరో నెల అనగా నవంబర్ వరకు పొడగించింది. కొత్తగా బార్లలో రిజర్వేషన్లు కల్పిస్తే వెనుకబడిన తరగతుల వారీకి సరైన అవకాశాలు రావడంంతో పాటు బార్ లైసెన్సుల్లో ఉన్న గుత్తాధిపత్యానికి తెరపడే అవకాశం ఏర్పడనుంది.