యాంకర్ శ్రీముఖి ఇంట్లో విషాద ఛాయలు

యాంకర్ శ్రీముఖి ఇంట్లో విషాద ఛాయలు

చిత్రసీమ లో రెండు రోజులుగా వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. శుక్రవారం మెగా హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురి కావడం..సోమవారం ప్రముఖ నటుడు ఉత్తేజ్ భార్య పద్మావతి కాన్సర్ తో మరణించడం..ఈరోజు యాంకర్ శ్రీముఖి అమ్మమ్మ అనారోగ్యం తో మృతి చెందడం చిత్రసీమ ను మరింత శోకసంద్రంలో పడేసింది. అమ్మమ్మ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ శ్రీముఖి ఎమోషనల్ అయ్యింది.

“అమ్మమ్మ అంటే నాకు ఇష్టం. జీవితంలో చాలా విషయాలను తన నాకు చెప్పింది. అమ్మమ్మ ఎప్పుడూ హుషారుగా ఉండేది. ఎల్లప్పుడూ సంతోషాన్ని అందరికీ పంచేది. అమ్మమ్మ చాలా ధైర్య వంతురాలు, జీవితంలో నువ్వు ఇచ్చిన ప్రతి దానికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎప్పుటికీ నిన్ను గుర్తు పెట్టుకుంటాను అమ్మమ్మ ” అంటూ సోషల్ మీడియా ద్వారా ఎమోషనల్ పోస్ట్ చేసింది. శ్రీముఖి అమ్మమ్మ మరణానికి సంతాపం తెలుపుతూ పలువురు ప్రముఖులు కూడా సంతాపం తెలుపుతున్నారు.

ఇక శ్రీముఖి విషయానికి వస్తే…పటాస్ షో తో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న శ్రీముఖి..బిగ్ బాస్ షో ద్వారా మరింత పాపులర్ అయ్యింది. బుల్లితెర ఫై టాప్ యాంకర్ గా రాణిస్తున్న శ్రీముఖి..సోషల్ మీడియా లోను యాక్టివ్ గా ఉంటూ ఫాలోయర్స్ ను అలరిస్తుంటుంది.