శ్రీమద్రామాయణం

ఆధ్యాత్మిక చింతన

Srimadramayanam
Srimadramayanam

రామ సుగ్రీవుల మైత్రి కుదిరింది. రాముని దుఃఖానికి కారణమేమిటో సుగ్రీవుడు తెలిసికున్నాడు. సుగ్రీవుని కష్టాలకు కారణమేమిటో రాముడు తెలుసుకున్నాడు.

వాలిని చంపుతానని శ్రీరాముడు మాట ఇచ్చాడు. సీతను వెదకి తెచ్చిఇస్తానని సుగ్రీవుడు మాట ఇచ్చాడు.

మాట ఇచ్చినట్టే శ్రీరాముడు వాలిని చంపి సుగ్రీవునకు పట్టాభిషేకం చేసి అధికారాన్ని కట్టబెట్టాడు.

ఇచ్చిన మాటను మరచి సుగ్రీవుడు తన మనోరధాలన్నీ తీర్చే భార్య రమ, తారలు లభించడం చేత రాత్రింబవళ్లు వారితోనే విహరిస్తూ వచ్చాడు.

ధర్మం విలువ తెలిసిన హనుమంతుడు సుగ్రీవ్ఞనితో నీకు రాజ్యం వచ్చింది. కీర్తి వచ్చింది, నీ సంపదలు వృద్ధి చెందాయి.

నీవ్ఞ ఎవరి సహాయంతో ఇవన్నీ పొందావో వారి పని కూడా చేసి పెట్టి వారి స్నేహాన్ని అభిమానాన్ని సంపాదించుకోవాల్సి ఉంది. తక్షణం నీవు ఆ పని చేయాల్సి ఉంది.

ఏ కాలంలో ఏది చేయాలో తెలుసుకొని మిత్రుల విషయంలో కృతజ్ఞలై ఉంటే రాజ్యం, కీర్తి, సంపద వృద్ధి చెందుతాయి. నీవ్ఞ చేసిన ప్రతిజ్ఞ ప్రకారం మిత్రుడి పని చేసి పెట్టాలి.

ఎవరు మిత్రులకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడో అట్టివాడు అడుగడుగునా కష్టాలనెదుర్కోవలసి వస్తుంది.

కాబట్టి మిత్రుడికి ఏ కార్యం ఏ సమయంలో చేయాలో ఆలస్యం కాకుండా ఆయపను లు చేయాలి. ఆ తర్వాత ఏమనుకున్నా ఏవిూ ప్రయోజనముండదు.

  • రాచమడుగు శ్రీనివాసులు

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/