శ్రీమద్రామాయణం

ఆధ్యాత్మిక చింతన

Srimadramayanam
Srimadramayanam

అయోధ్యాధిపతి అంబరీషుడు యాగం చేయాలనుకున్నాడు. ఎప్పటిలాగే ఇంద్రుడు యాగపశువ్ఞను దొంగిలించాడు. ఒక మనిషిని తెచ్చి తగిన కర్మలు చేసి పశువుగా బలి ఇవ్వాలని పురోహితులు సలహా ఇచ్చారు.

అంబరీషుడు అలాంటి మనిషిని తేవటానికి పల్లెలు పట్టణాలు, ఆశ్రమాలు వెదకి చివరకు బుచీక మహర్షి ఆశ్రమానికి వచ్చాడు విషయాన్నంతా చెప్పి నీ కుమారుల్లో ఒకరిని నాకు ఇవ్వు, బదులుగా లక్ష గోవులను ఇస్తాను అన్నాడు.

అప్పుడు బుచీకమహర్షి పెద్ద కొడుకు అంటే తనకు చాలా ఇష్టమని, చిన్నకొడుకు తన భార్యకు ఇష్టమని, అందుకు వారిని ఇవ్వలేనని చెప్పాడు. వీరి సంభాషణను వింటున్న రెండవ కొడుకు ముందుకు వచ్చి తనను తీసికొని పొమ్మన్నాడు.

అంబరీషుడు బుచకునికి లక్ష గోవ్ఞలనిచ్చి అతనిని తీసుకొని వెళ్లాడు యాగ పశువ్ఞగా బలి ఇవ్వటానికి వారు మార్గ మధ్యంలో పుష్కర క్షేత్రమందు బసచేశారు.

యాగ పశువ్ఞగా వచ్చిన శునశ్శేఫుడు దుఃఖంతో బాధపడుతూ అక్కడే తపస్సు చేసుకొంటున్న విశ్వామిత్రుని ఎలాగైనా తనను రక్షించమని వేడకున్నాడు. నాకు కలకాలం జీవించి, తపస్సుచేసి స్వర్గాన్ని చేరాలని ఉంది అని చెప్పాడు.

విశ్వామిత్రుడు అతనిపై దయదలచి అభయమిచ్చాడు. తన పుత్రులను పిలిచి విషయాన్నంతా చెప్పి శునశ్శేఫుని బదులుగా బలి ఇవ్వబడటానికి ఎవరో ఒకరు సిద్ధం కండి అన్నాడు.

కానీ వారందరూ తిరస్కరించారు. విశ్వామిత్రుడు కోపగించి మీరందరూ ముష్టిక జాతులందుపుట్టి కుక్క మాంసంతింటూ వెయ్యి సంవత్సరాలు పడి ఉండండి అని శపించాడు.

తరువాత శునశ్శేషా! నేనిచ్చే ఈ మంత్రాలతో అగ్నిని స్తుతించు నీవ్ఞ కోరినట్లు జీవించి, నీ లక్ష్యాన్ని సాధిస్తావ్ఞ అని చెప్పాడు. యజ్ఞం ప్రారంభమైంది. శునశ్శే ఫుని యూపస్థంబానికి కట్టారు.

ఆయన ఆ రెండు మంత్రాల్నీ శ్రద్ధతో పఠించాడు. ఇంద్రుడు మెచ్చి అతనికి దీర్ఘాయువ్ఞను ప్రసాదిం చాడు. అంబరీషుడు ఎన్నో రెట్లు అధికంగా యజ్ఞ ఫలాన్ని పొం దాడు. విశ్వామిత్రుడు తన తపస్సును కొనసాగించాడు.

ఇది శ్రీమ ద్రామా యణంలో బాలకొండలో 61, 62 సర్గల్లో మనకు కనపడేకథ. జరిగిన దాన్ని జరిగినట్టుగా చెప్పినందుకు ముందు మనం వాల్మీకి మహర్షిని అభినందించవలసిందే.

అంబరీ షుడు యాగాన్ని చేయాలనుకోవటం మంచిదా, చెడ్డదా? మంచిదే అయితే యాగపశువ్ఞను ఇండ్రుడు ఎందుకు దొంగిలించాడు? ఆయన అలా చేయటం మంచిదేనా? పశువ్ఞకు బదులు మనిషిని బలి ఇవ్వాలని పురోహితులు ఎందుకు సలహా ఇచ్చారు?

ఏ పేద స్త్రీ అయినా తనకు పుట్టిన బిడ్డను తన పేదరికం కారణంగా సరిగ్గాపెంచి పోషించ లేనని భావించి ఏ ధనికునికో ఇస్తే తన బిడ్డ జీవితం బాగుంటుందని ఆశించి పిల్లలులేని ధనికునికి ఇచ్చి తాను కొంత డబ్బు తీసుకుంటే ‘హృదయంలేని తల్లి ‘మాతృత్వాన్ని మంట కలిపిన తల్లి అని అంటామే .

మరి బుచీకుడు లక్ష గోవ్ఞలను తీసుకొని బలి ఇవ్వబడ టానికి ఏ మాత్రం ఇష్టంలేని తన కొడుకును, ఇంకా జీవించి తపస్సు చేయాలని కోరుకొంటున్న కొడుకును అంబరీషునికి అమ్మితే ఆయన మహర్షి´ ఎట్లయ్యాడు?

బలి ఇవ్వబడటానికి అంగీకరించని కొడుకునలు మీరు కుక్క మాంసం తింటూ వెయ్యేండ్లు పడి ఉండండి అని శపించిన తండ్రి విశ్వామిత్రుడు ‘తండ్రి పదానికి అర్హడేనా? శునశ్శేఫునికి ఇచ్చే ఆ రెండు మాంత్రాలను ముందే అతనికి ఇచ్చి ఉంటే కొడుకునలు శపించవలసిన అవసరమే వచ్చి ఉండేది కాదు కదా? ఇలా ఎన్నెన్నో ప్రశ్నలను, సందేహాలను వెలిబుచ్చ టానికి, మన మేధస్పుసను పదును పెట్టటానికి అవకాశం కల్గిస్తుంది.

వాల్మీకి రామాయణం, ఎప్పుడైతే ప్రశ్నించే ప్రజ్ఞ, మనలో మొలకెత్తు తుందో అదే మనకు శుభ ఘడియ అవ్ఞతుంది.ప్రకృతిని ప్రశ్నిస్తాం, పురాణాన్ని ప్రశ్నిస్తాం, పెద్దలను ప్రశ్నిస్తాం.

జీవిత సంఘటనలను ప్రశ్నిసాం, చివరకు అసలు ‘నేను ఎవరు? అనే ప్రశ్నకు చేరుకుంటాం. ఆ ప్రశ్నే వెంకటరామన్‌ను ‘భగవాన్‌ రమణ మహర్షిగా చేసింది.

‘ మీరు భగవంతుని చూశారా? అనే ప్రశ్నే నరేంద్రుడిని ‘స్వామి వివేకానందగా ప్రకాశింపచేసింది. ఏ ప్రశ్నకు సమాధానం లభిస్తే ఏ ఇతర ప్రశ్నలు ఉద్భవించవో- ఆ స్థాయి మనకు లభించే వరకు ఎవరు మనలను ఏమని నిందించినా లెక్కచేయక ప్రతి విషయాన్ని ప్రశ్నిస్తూనే ఉండాలి.

అదొక్కటే మనలను అసత్యం నుంచి సత్యానికి, చీకటినుంచి వెలుగులోకి, మృత్యువు నుంచి అమృతత్వానికి తీసుకొని పోగలదు.రామాయణ, భారత భాగవతాది గ్రంథాలు మనం ఆస్థితిని చేరుకోవటానికి తోడ్పడే గ్రంథాలు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/