టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న శ్రీలంక

SRILANKA vs AUSTRALIA
SRILANKA vs AUSTRALIA


లండన్‌: ప్రపంచకప్‌ క్రికెట్‌లో భాగంగా ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య ఆసక్తికర పోరు ఆరంభమైంది. టాస్‌ గెలిచిన శ్రీలంక కెప్టెన్‌ దిముత్‌ కరుణరత్నే ఫీల్డింగ్‌ ఎంచుకున్నారు. లక్మల్‌ స్థానంలో సిరివర్ధనకు అవకాశం ఇచ్చినట్లు వివరించాడు. మరోవైపు గాయంతో బాధపడుతున్న కౌల్టర్‌ నైల్‌ స్థానంలో బెహ్రెండార్ఫ్‌ను ఎంపిక చేసినట్లు ఆసీస్‌ సారథి ఫించ్‌ వెల్లడించాడు.
శ్రీలంకపై సునాయాసంగా గెలిచిపాయింట్ల పట్టికలో ఆగ్రస్థానంలో నిలవాలని ఆసీస్‌ భావిస్తుంది. రెండు మ్యాచులు వర్షం కారణంగా మైదానంలోకి అడుగుపెట్టలేదు శ్రీలంక. న్యూజిలాండ్‌ చేతిలో చిత్తుగా ఓడిన లంక ఆఫ్ఘనిస్తాన్‌పై మాత్రమే నెగ్గింది. మరోవైపు పాక్‌పై విజయంతో జోష్‌లో ఉన్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు గాడిలో పడ్డారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/