అతిలోక సుందరి మైనపు విగ్రహావిష్కరణ

బంగారు దుస్తులు, కిరీటంతో మెరిసిపోతున్న శ్రీదేవి

sridevi-wax-statue
sridevi-wax-statue

సింగపూర్‌: అతిలోక సుందరి శ్రీదేవి మైనపు విగ్రహావిష్కరణ కార్యక్రమం ఈరోజు సింగపూర్ లో ఘనంగా జరిగింది. సింపూర్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీదేవి భర్త బోనీ కపూర్, కూతురు జాన్వి పాల్గొన్నారు. బంగారు వస్త్రాలను ధరించి, తలపై కిరీటంతో శ్రీదేవి దివి నుంచి భువికి దిగివచ్చిన దేవకన్యలా మెరిసిపోతోంది. శ్రీదేవి, అనిల్ కపూర్ కాంబినేషన్లో 1987లో వచ్చిన ‘మిస్టర్ ఇండియా’ చిత్రంలోని ‘హవా హవాయి’ పాట లుక్ ఆధారంగా ఈ విగ్రహాన్ని రూపొందించారు.


తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/