శ్రీదేవి సోడా సెంటర్ ఫస్ట్ డే కలెక్షన్స్

శ్రీదేవి సోడా సెంటర్ ఫస్ట్ డే కలెక్షన్స్

సుధీర్ బాబు, ఆనంది జంటగా కరుణకుమార్ (పలాస 1978 ఫేమ్) దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీదేవి సోడా సెంటర్’ చిత్రం శుక్రవారం (ఆగస్టు 27) గ్రాండ్ గా విడుదలైంది. కరోనా సెకెండ్ వేవ్ తర్వాత బిగ్గెస్ట్ రిలీజ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. సుధీర్ బాబు యాక్టింగ్ కు మంచి మార్కులే పడినప్పటికీ కథ స్లో గా సాగడం , క్లైమాక్స్ తప్ప సినిమాలో ఏమిలేదని టాక్ రావడం తో చిత్ర యూనిట్ షాక్ లో పడ్డారు. ఇదిలా ఉంటె ఫస్ట్ డే కలెక్షన్లు అనుకున్న రేంజ్ లో రాలేదని తెలుస్తుంది.

తెలుగు రాష్ట్రాల్లో కోటి 40 లక్షల రూపాయల షేర్ రాబట్టగా.. వరల్డ్ వైడ్ గా కేవలం రెండున్నర కోట్ల రూపాయల గ్రాస్ మాత్రమే రాబట్టిందట. తెలంగాణ లో భారీ థియేటర్స్ లలో విడుదలైనప్పటి ప్రేక్షకులు సినిమాను చూసేందుకు పెద్దగా ఇంట్రస్ట్ చూపించలేదని కలెక్షన్లు బట్టి చెప్పవచ్చు. మొదటి రోజే ఇలా ఉంటె రాబోయే రోజుల్లో కలెక్షన్లు ఎలా ఉంటాయో చూడాలి.