శ్రీదేవిది హత్యే, కేరళ మాజీ డిజిపి వెల్లడి

Sridevi
Sridevi, actress


న్యూఢిల్లీ: వెండితెరపై ఓ వెలుగువెలిగిన అలనాటి తార, అతిలోకసుందరి శ్రీదేవి మరణంపై ఇంకా కుట్ర కోణాలు బయటకు వస్తూనే ఉన్నాయి. ఆమె మరణించి ఏడాది దాటినా ఇంకా సందేహాలు వ్యక్తమవుతూనూ ఉన్నాయి. తాజాగా, శ్రీదేవిది హత్యేనని, ఆమె మరణంలో సహజత్వం ఎక్కడా లేదని కేరళ జైళ్ల శాఖ మాజీ డిజిపి రిషిరాజ్‌ సింగ్‌ మునిగి చనిపోయి ఉండవచ్చు అంటూ ఓ దినపత్రికకు వ్యాసం రాశారు. అందులో అనేక ఆసక్తికర విషయాలు వెల్లడిచేశారు. ఆమె మరణానికి సంబంధించిన విషయాలను ఫోరెన్సిక్‌ నిపుణులైన తన స్నేహితుడు ఉమా దత్తన్‌ తనతో పంచుకున్నారని వ్యాసంలో పేర్కొన్నారు.
ఒక మనిషి ఎంత మద్యం మత్తులో ఉన్నా అడుగు లోతు ఉండే నీటి తొట్టిలో పడి చనిపోవడం అసాధ్యం అని ఉమాదత్తన్‌ తనతో చెప్పినట్లు రిషిరాజ్‌ సింగ్‌ పేర్కొన్నారు. ఐతే ఆయన ఇటీవలే మరణించారని తెలిపారు. దుబాయిలో ఓ పెళ్లి వేడుకకు వెళ్లిన శ్రీదేవి..గత ఏడాది ఫిబ్రవరి 24న బాత్‌టబ్‌లో మునిగి మరణించిందని యూఏఈ ఫోరెన్సిక్‌ అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే.

తాజా యాత్ర వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/tours/