అతిలోక సుందరి పుస్తకావిష్కరణ

book launch
book launch


దివంగత నటి శ్రీదేవి గురించి సీనియర్‌ జర్నలిస్టు పసుపులేటి రామారావు రచించిన అతిలోక సుందరి పుస్తకావిష్కరణ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.. ఈ కార్యక్రమంలో రకుల్‌ప్రీత్‌సింగ్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని తొలి ప్రతిని ఆవిష్కరించారు. దిల్‌రాజుకు అందజేశారు. తొలిప్రతిని మాదాల రవి రూ.20 వేలు ఇచ్చి కొనుగోలు చేశారు.


రేలంగి నరసింహారావు మాట్లాడుతూ, సినిమా ఇండస్ట్రీలో మరుగున పడుతున్న ఎందరో మహానుభావుల చరిత్రను పసుపులేటి, వినాయకరావు రాయటం చాలా మంచి విషయం అన్నారు. బాలనటిగా ఆమె బలిపీఠంలో రోజారమణి పాత్రలో నటించాల్సింది.. కానీ అపుడు కుదరలేదు.. ఆ తర్వాత బంగారక్క నుంచి ఎన్నో సినిమాల్లో నటించారని, మా గురువుగారి దర్శకత్వంలో నటించేటపుడు మేం అక్కడే ఉండేవాళ్లమని తెలిపారు. ఆమెకు డెడికేషన్‌ ఎక్కువ అన్నారు. పుసులేటి రాసిన ఈపుస్తకాన్ని పూర్తిగా చదివానని, ఆయనలోని రచయిత బటయకు వచ్చి ఈ పుస్తకాన్ని రాశారనిపించిందన్నారు. ప్రతి వ్యాఖ్యం గొప్పగా రాశారని అన్నారు.

రకుల్‌ప్రీత్‌సింగ్‌ మాట్లాడుతూ, అతిలోక సుందరి అనే పేరు ఆమెకే చెల్లిందన్నారు. ఆమె జీవితం ఓ వేడుక అన్నారు. ఇండియాలో తొలి సూపర్‌స్టార్‌ ఆమె అన్నారు. ఆమె నా ఫేవరేట్‌ పర్సన్‌ అని తెలిపారు. రచయిత పసుపులేటి రామరావు మాట్లాడుతూ, శ్రీదేవి నాకు బాలనటిగా పరిచయం అని, ఆ పాప గురించి జ్యోతిచిత్రలో రాయమని వాళ్ల అమ్మ నన్ను ఎన్నోసార్లు అడేగవారు.. ఒకసారి మాదాల రంగారావుగారు ఓ సినిమా వార్త ఇవ్వమని చెప్పారు నేను ఇచ్చాను.. అందులో దర్శకుడి పేరు లేదు..ఆ దర్శకుడు సెట్‌లోనే నేను శ్రీదేవి ఇంటర్వ్యూ చేయాల్సి వచ్చింది.. అపుడు ఆ దర్శఖుడు నన్ను బయటకు పొమ్మన్నారు..

కానీ ఆమె మాత్రం బయటకు వచ్చి నన్ను పిలిచి ఇంటర్వ్యూ ఇచ్చింది.. ఆ మధ్య ఒకసారి ఆమె పార్క్‌ హయత్‌ హోటల్‌లో ఉందని తెలిసి వెళ్లాం.. నేను సంతోషం కొండేటి సురేష్‌, ఫొటోగ్రాఫర్‌ వాసుతో కలిసి వెళ్లాం.. ఆమె మా కోసం కిందికు దిగి వచ్చి ..ఇంటర్వ్యూ ఇవచ్చారు. ఆమె ఎక్కడున్నా ఆమెను మర్చిపోలేం అన్నారు. కార్యక్రమంలో శివాజీ రాజా, అచ్చిరెడ్డి, బండారు సుబ్బారావు, వైకె నాగేశ్వరరావు, దిల్‌రాజు, బివిఎస్‌ఎన్‌ప్రసాద్‌, ఆర్‌ నారాయణమూర్తి, వైవిఎస్‌ చౌదరి, మాదాల రవి, సురేష్‌ కొండేటి, ఏడిద శ్రీరామ్‌ తదితరులు ప్రసంగించారు.