బాసరలో శ్రీ వసంత పంచమి ఉత్సవాలు

Basara Gnana Saraswati
Basara Gnana Saraswati

నిర్మల్‌ : ఈరోజు నుండి మూడు రోజుల పాటు బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో శ్రీ వసంత పంచమి ఉత్సవాలు జరగనున్నాయని ఆలయ వేద పండితులు తెలిపారు. మంగళవారం వేకువజామున వేద పండితులు, ఆలయ అర్చకులు సరస్వతి అమ్మవారికి అభిషేకం, అర్చన, విశేష పూజలు నిర్వహించారు. మొదటి రోజు వసంత పంచమి ఉత్సవాలలో భాగంగా… ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు వేద పారాయణం, చండీ మహా విద్యా పారాయణం, నవ చండీ సహిత మహా విద్యా హోమం, పుణ్య వచనంలతో వసంత పంచమి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/