గవర్నర్‌ తమిళిసైని కలిసిన పరిపూర్ణనంద స్వామి

swami-paripoornanda
swami-paripoornanda

హైదరాబాద్‌: రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసైని స్వామి పరిపూర్ణనంద కలిసారు. గవర్నర్‌గా తెలంగాణకు వచ్చిన తర్వాత కలవలేదని భేటీ మర్యాదపూర్వకంగా జరిగిందని తమిళిసై తెలంగాణ గవర్నర్‌గా ఎంపికయినందుకు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశానని అన్నారు. అనంతరం మీడియాతో మాట్లడుతూ గవర్నర్‌ తో రాజకీయ అంశాలేమీ చర్చింలేదని స్వామి పరిపుర్ణనంద అన్నారు. ఈ సందర్బంగా ఆయన ఆర్టీసీ కార్మికుల సమ్మె పైనా మీడియా అడిగిన ప్రశ్నకు స్పందించారు. ఆర్టీసీ వ్యవహరం జఠిలమైన సమస్యగా మారిందని రాష్ట్రం ప్రభుత్వం తొందరగా ఈ సమస్యకు పరిష్కారం చూపించాలని అన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు దీపావలి శుభకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలో ఆర్టీసీ సమస్య ఉన్నప్పుడు స్వామి పరిపుర్ణనంద తమిళిసై గవర్నర్‌ను కలవడంతో ఈ భెటీకి ప్రాధన్యత సంతరించుకుంది.
తాజా బిజెనెస్‌ వార్తలకోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/