వైభవంగా వేములవాడలో శ్రీరామనవమి

vemulawada
vemulawada


రాజన్న సిరిసిల్ల: తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి వారి ఆలయంలో సీతారాముల కళ్యాణం కన్నుల పండువగా జరిగింది. సీతారాముల కళ్యాణం సందర్భంగా పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈనెల 14న రాష్ట్రమంతటా సీతారాముల కళ్యాణం నిర్వహించనుండగా, వేములవాడలో ఒక రోజు ముందే కళ్యాణం వేడుకను నిర్వహించారు. వేములవాడ ఆలయంలో శివుడికి, రాముడికి సమానంగా పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కల్యాణ వేడుకలో ఎంపి వినోద్‌ కుమార్‌, ఎమ్మెల్యే రమేశ్‌బాబు పాల్గొన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/