శ్రీ మహాసరస్వతి రూపంలో

శ్రీ మహాసరస్వతి రూపంలో
Sarannavarati festival in Indrakeeladri

ఇంద్రకీలాద్రి: శరన్నవరాత్రి ఉత్సవాల్లో ముఖ్యమైన ఘట్టం దివ్యసుందరంగా ఆవిష్కృతమైంది. మూలా నక్షత్రం, సప్తమి తిథి సందర్భంగా దుర్గమ్మ శనివారం శ్రీ మహాసరస్వతి రూపంలో భక్తులను అనుగ్రహించారు. వీణాపాణిగా అనుగ్రహించిన దుర్గమ్మను దర్శించుకో టానికి వచ్చిన భక్తులతో ఇంద్రకీలాద్రి భక్తజనసంద్రమైంది. చేతిలో నాలుగు వేదాలు, బ్రహ్మకమండలం ధరించిన శ్రీ మహాసరస్వతిగా దుర్గమ్మను దర్శించుకోవాలని పెద్దఎత్తున భక్తులు తరలిరావడంతో ఆలయ అధికారులు, ఇతర శాఖాధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ముందుగానే ప్రకాశం బ్యారేజ్‌ నుండి వచ్చే వాహనాలను దారిమళ్లించారు.

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/