నేడు మోడితో భేటి కానున్న శ్రీలంక అధ్యక్షుడు

రాజపక్సే అధికారంలోకి వచ్చాక తొలి విదేశి పర్యటన

Gotabaya Rajapaksa-modi
Gotabaya Rajapaksa-modi

న్యూఢిల్లీ: శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే రెండు రోజుల పర్యటన కోసం గురువారం న్యూఢిల్లీ చేరుకున్నారు. ఆయనకు కేంద్ర మంత్రి వికె సింగ్‌ స్వాగతం పలికారు. రాజపక్సే అధికారంలోకి వచ్చాకా తన తొలి విదేశీ పర్యటన కోసం భారతదేశం వచ్చారు. రెండు దేశాల మధ్య సంబంధాలను విస్తృతం చేసుకునేందుకు అవసరమైన చర్యలపై శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడితో,రాజపక్సే చర్చించనున్నారు. రాజపక్సే విజయానంతరం ఆయనను మోడీ మన దేశానికి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. శ్రీలంకతో మరింత సన్నిహిత సంబంధాలను ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్నామని, అక్కడి తమిళుల ఆకాంక్షలను నెరవేర్చాలని మన దేశం గత వారం కోరిన సంగతి తెలిసిందే.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/