గోపబాలురు – బృందావనం

Sri Krishna

బృందావనం దాటి దూరంగా ఆవులను మేపటానికి శ్రీకృష్ణుడు, కొందరు గోపబాలురు వెళ్లారు. కొంతసేపటికి గోపబాలకులకు ఆకలి అయింది. దగ్గరలోనే బ్రాహ్మణులు అంగిరస యజ్ఞమును చేస్తున్నారు. మీరు వెళ్లి నేను పంపించానని వారికి చెప్పండి. వారు మీకు తగిన ఆహారాన్ని ఇస్తారు అని శ్రీకృష్ణుడు గోపబాలురకు చెప్పి పంపాడు. వారు అట్లే వెళ్లి, ‘విప్రులారా! మేము రామకృష్ణుల అనుచరులం.

రామకృష్ణులు పంపగా మీ వద్ద ఆహారాన్ని యాచించ వచ్చితిమి. మాకు బాగా ఆకలిగా ఉన్నది అని చెప్పారు. ‘విప్రులు పండితులే అయిననూ మూర్ఖులైరి స్వర్గఫలాన్నాశించి కష్టసాధ్యమైన యజ్ఞం పూర్తి చేయటంలో తలమునకలై యుండిరి. గోపబాలురు ఎంతగా యాచించిననూ వారికి అన్నమీయలేదు. అలక్ష్యముతో వారిని నిరాకరించిరి అని శుకమహర్షి అంటాడు. ఆ విషయాన్ని బమ్మెరపోతన ఇలా రాసాడు.
ీక్రతువున్‌ మంత్రము దంత్రమున్‌ ధనములు, గాలంబు దేశంబుదే
వతయున్‌ ధర్మము నన్యముల్‌ దలపనెవ్వాడట్టి సర్వేశ్వరున మతినూహింపక గోపబాలుడనుచున్‌ మందస్థితించూచి దుర్మతులై యన్నములేదు లేదనిరి సమాన క్రియా శూన్యులై
నిరాశపడి వట్టి చేతులతో తిరిగి వచ్చిన గోపబాలకులు జరిగిన విషయాన్నంతా శ్రీకృష్ణునకు తెలిపారు. అప్పుడు ఆయన వారితో గోపాలులారా! సంకల్పాలు నెరవేనప్పుడు నిరాశపడరాదు. బ్రాహ్మణుల పత్నుల వద్దకు వెళ్లి అడగండి అని చెప్పాడు. వారు అలాగే చేశారు.

బ్రాహ్మ స్త్రీలు ఎంతో సంతోషించి భక్ష్యభోజ్యలేహ్యచోష్యపానీయాలను కుండలలో నింపుకొని గోపబాలుర వెంటక శ్రీకృష్ణ బలరాములున్న చోటుకు వచ్చి వాటిని సమర్పించారు. వారి భక్తిని శ్రీకృష్ణుడు మెచ్చుకొన్నాడు. ఆ తర్వాత ఆ విషయాన్నంతా తెలుసుకున్న బ్రాహ్మణులు, ‘భక్తియున్నవారికి ఉపనయన సంస్కారము, గురుసేవ, తపస్సు, ఆత్మవిచారము, శౌచము సంధ్యావందనాది నిత్యకర్మలతో నిమిత్తము లేదని మా స్త్రీలు ధ్రువపరచిరి.

మేము అట్టి సంస్కారములు కలిగి యున్నను, అట్టి భక్తి కలుగలేదు అని వాపోయారు.
పోతన అంటారు – ‘పరమేశ్వరార్పణంబుగ పరజనులకు భిక్షయిడిన పరమపదమునంపరగెదరట తుది సాక్షాత్పరమేశుడు భిక్షగొన్న ఫలమెట్టిదియో భాగవతాన్ని పారాయణంచేసి, పూజ చేసి మన భక్తిని చాటుకోవడం వల్ల ఇతరులకు కూడా భాగవతం పట్ల గౌరవాన్ని, శ్రద్ధను పెంచినవారమవుతాం.
అది కొంత వరకు మంచిదే. అయినా అక్కడే నిలబడిపోరాదు. భాగవతంలోని బోధను గ్రహించి ఆచరించాలి. ఈ చిన్న కథాంశంలోనే ఎంత మంచి విషయాలున్నాయి.

మనము కోరుకొన్నట్లు ఏది జరక్కపోయినా నిరాశ నిస్పృహలకు లోనవుతాము. అలాకాక మరొక విధంగా ప్రయత్నము చేయాలని ఈ కథ తెలుపుతుంది. యజ్ఞయాగాది క్రతువుల కన్నా ఆకలిగొన్న వానికి ఇంత అన్నం పెట్టటం వల్ల భగవంతునికి ప్రీతి పాఉత్రలమువతాం అని తెలుస్తున్నది. పాండిత్యం కన్నా ప్రేమ ముఖ్యమని ఈ కథ బోధిస్తున్నదని గ్రహించి అలా జీవిద్దాం.

  • రాచమడుగు శ్రీనివాసులు

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/