Auto Draft

ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి శరన్నవరాత్రుల అలంకారాలు

Sri Durga Devi
Sri Durga Devi

”విద్యుద్దామ సమప్రభాంమృగపతి స్కంధస్ధితాం భీషణాం
కన్యాభిః కరవాలఖేటవిలద్దస్తా భిరాసేవితాం!
హసైశ్చక్రగదాసిఖేటవిసిఖాంశ్చావం గుణం తర్జనీం
బిభ్రాణా మనలాత్మికాం శశిధరాందుర్గాం త్రినేత్రాం భజే

దసరా నవరాత్రులలో అష్టమి తిధిన దుర్గతులను నివారించే మహాశక్తి స్వరూపంగా అమ్మవారు దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. ఈ అవతారంలో అమ్మ దుర్గముడనే రాక్షసుడ్ని సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి.

పంచ ప్రకృతి మహాస్వరూపాల్లో దుర్గా రూపం మొదటిది. భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని ఈ మాత అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. కోటి సూర్యప్రభలతో వెలిగొందే అమ్మను అర్చిస్తే అర్చిస్తే శత్రుబాధలు నశిస్తాయి.

విజయం కలుగుతుంది. దుర్గతుల నుండి రక్షించే తల్లిగా దుర్గమ్మను వేదవిధులు కీర్తిస్తారు. సకల గ్రహ బాధలు దుర్గమ్మ నామాన్ని జపిస్తే తొలగిపోతాయి. ఆరాధకులకు దుర్గదేవి అమ్మవారు శీఘ్ర అనుగ్రహకారిణి.

అలంకారం: అమ్మవారిని ఎరుపు వర్ణంతో కూడిన పట్టుచీరతో అలంకరిస్తారు.

మంత్రం: ”ఓం దుం దుర్గాయైనమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. దుర్గా, లలిత అష్టోత్తరాలు పఠించాలి.

నైవేధ్యం: అమ్మవారికి పులగాన్నం నివేదన చేయాలి. ఎర్రనిబట్టలు పెట్టి, ఎర్రని అక్షతలు, ఎర్రని పుష్పాలతో దుర్గాసూక్తం పారాయణం చేస్తూ అమ్మవారిని పూజించాలి.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/