బాలయ్య మూవీ లో జాయిన్ అయినా ధమాకా బ్యూటీ

ధమాకా బ్యూటీ శ్రీలీల..తాజాగా నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న బాలయ్య 108 మూవీ లో జాయిన్ అయ్యింది. పెళ్లి సందD మూవీ తో హీరోయిన్ గా ఇండస్ట్రీ కి పరిచమైన శ్రీలీల..మొదటి సినిమా తోనే తన అందం , డాన్స్ తో యూత్ ను కట్టిపడేసింది. రీసెంట్ గా ధమాకా మూవీ మరోసారి తన గ్లామర్ తో , డాన్స్ తో చించేసింది. దీంతో అమ్మడికి వరుస ఛాన్సులు వస్తున్నాయి. హీరోయిన్ గానే కాకుండా ఐటెం సాంగ్, కూతురి పాత్రలో కూడా నటించేందుకు ఇంట్రస్ట్ చూపిస్తుంది. ఈ క్రమంలో అనిల్ రావిపూడి – బాలకృష్ణ కలయికలో తెరకెక్కుతున్న బాలకృష్ణ 108 మూవీ లో బాలయ్య కూతురి గా కనిపించబోతుంది.

ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న ఈ చిత్ర షూటింగ్ లో శ్రీలీల జాయిన్ అయ్యింది. ఈ సందర్భంగా ఈ సినిమా టీమ్ ఆమెకి వెల్కమ్ చెప్పింది. ఈ సినిమాలో బాలయ్య సరసన కథానాయికగా ఎవరు నటిస్తారనే విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుంది. ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ‘అఖండ’ .. ‘వీరసింహా రెడ్డి’ సినిమాల తర్వాత మరోసారి థమన్..బాలయ్య చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నాడు. అనిల్ రావిపూడి ఈ సినిమాలో తన మార్క్ కామెడీ కంటే బాలయ్య యాక్షన్ ను ఎక్కువ గా చూపించబోతున్నట్లు వినికిడి.