ఎస్‌పిఎంఎల్ ఇన్ఫ్రా ర్యాలీ
SPML Infra Ltd.
న్యూఢిల్లీ : గుజరాత్, మణిపూర్, పంజాబ్‌ల నుంచి మంచినీటి సరఫరా, నీటిపారుదలకు సంబంధించిన నాలుగు ప్రాజెక్టును గెలుచుకున్నట్లు ఎస్‌పిఎంఎల్ ఇన్ఫ్రా తాజాగా వెల్లడించింది. వీటివిలువ రూ.883 కోట్లుగా తెలియచేసింది. వీటిలో గుజరాత్ ప్రభుత్వం నుంచి సౌరాష్ట్ర నర్మద అవతరణ్ ఇరిగేషన్ మూడో దశకు సంబంధించి లభించిన రూ.824కోట్ల కాంట్రాక్టు కలిసి ఉన్నట్లు తెలియచేసింది. ఈ దారిలోనే సృష్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ భాగస్వామ్యం ద్వారా రూ.104కోట్ల విలువైన నీటి పంపిణీ నెట్వర్క్ ఆర్డర్‌ను పొందినట్లు వెల్లడించింది. దీంతో ఈ షేరు ఎన్ఎస్ఇలో 18శాతం ర్యాలీతీసి రూ.36వద్ద ట్రేడవుతోంది. కంపెనీలో ప్రమోటర్లకు 38.20వాటా ఉంది.
https://www.vaartha.com/news/business/మరిన్ని తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి.