స్పైస్‌జెట్‌ అదిరిపోయే ఆఫర్‌

ప్రారంభ టికెట్ ధర రూ.987 మాత్రమే

SPICEJET
SPICEJET

న్యూఢిలీ: స్పైస్‌జెట్‌ ఎయిర్‌లైన్స్‌ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. స్పైస్‌జెట్ స్ప్రింగ్ సీజన్ సేల్‌లో డొమెస్టిక్ ఫ్లైట్ టికెట్ ప్రారంభ ధర రూ.987 మాత్రమే. ఇక ఇంటర్నేషనల్ ఫ్లైట్ టికెట్ ప్రారంభ ధర రూ.3,699. ఈ సేల్ 2020 మార్చి 12న ప్రారంభమైంది. ఆఫర్ 2020 మార్చి 15న ముగుస్తుంది. ఈ ఆఫర్‌ ధరకే 2021 ఫిబ్రవరి 28 వరకు ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అంటే ఈ వేసవి సెలవులతో పాటు వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 లోగా ఏవైనా ప్రయాణాలు ఉంటే ఇప్పుడే ప్లాన్ చేసుకోవచ్చు. స్పైస్‌జెట్ వెబ్‌సైట్‌తో పాటు యాప్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. టికెట్లు క్యాన్సిల్ చేస్తే నార్మల్ క్యాన్సలేషన్ ఛార్జీలతో రీఫండ్ పొందొచ్చని స్పైస్‌జెట్ చెబుతోంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/