సోనియా, రాహుల్, ప్రియాంకలకు ఎస్పీజీ భద్రత తొలగింపు!

సీఆర్పీఎఫ్ కమాండోలతో భద్రత

Gandhi family
Gandhi family

న్యూఢిల్లీ: గాంధీల కుటుంబానికి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) భద్రత తొలగించాలని కేంద్రం నిర్ణయించినట్టు ప్రభుత్వ వర్గాలంటున్నాయి. కాంగ్రెస్ అగ్రనేతలైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు ఎస్పీజీ భద్రత తొలగించి, దాని స్థానంలో జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తోంది. గాంధీ కుటుంబీకులు దేశంలో ఎక్కడికెళ్లినా జడ్ ప్లస్ భద్రత కింద సీఆర్పీఎఫ్ కమాండోలు భద్రత విధులు నిర్వర్తిస్తారు. దీనిపై అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది.
తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/