నియమబద్ధ యోగాతోనే నిజమైన ఫలితం

Yoga
Yoga

నేడు ఎక్కువ మంది Yసీలు పలురకాల మానసిక ఒత్తిడులు, శారీరక రుగ్మతలకు గురవుతున్నారు. థైరాయిడ్‌, అధికబరువు, బిపి, మోకాళ్ల నొప్పులు, మెడ, వెన్నెముక నొప్పులు, రుతు క్రమంలో అపసవ్యతలు లాంటి అనేక సమస్యలకు తరచుగా గురవుతున్నారు. యోగసాధనతో వీటి నుంచి బయటపడి సంపూర్ణారోగ్యాన్ని మన సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అదెలాగో తెలుసుకుందాం.
యోగాభ్యాసం మొదలుపెట్టే ముందు ముఖ్యంగా పాటించాల్సిన నియమాలు కొన్ని ఉన్నాయి.
యోగసాధన చేసే ముందు మలమూత్ర విసర్జన తప్పనిసరి.
యోగసాధనకు 20నుంచి 30 నిముషాల ముందు మంచినీరు తాగటం అలవాటు చేసు కోవాలి.Yసీలు బహిష్టు సమయంలో యోగాభ్యాసం చేయకూడదు.
ముఖ్యంగా ప్రశాంతమైన మనసుతో చేయాలి. మనసులో ఒత్తిడులు- కోపం, భయం, అయిష్టత, మొదలైనవి ఉన్నపుడు యోగసాధన చేయకూడదు.
్య యోగా చేయడానికి ముందు కాఫీ, టీల లాంటివి తీసుకోకూడదు.
శరీరాన్ని పట్టి ఉండే బిగుతైన దుస్తులు ధరించకూడదు. సాధ్యమైనంత వరకు వదులుగా ఉండేలా కాటన్‌ దుస్తులు వేసుకోవాలి.
దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు అనుభవజ్ఞులైన యోగ శిక్షకుల సమక్షంలో యోగా భ్యాసం చేయటం మంచిది.

సాధన ఇలా…
శబ్దకాలుష్యం, వాయుకాలుష్యంలేని ప్రదే శాన్ని ఎంపిక చేసుకోవాలి.
్య గాలి, వెలుతురు ఉండే విశాలమైన గదిలో గాని, ఆరుబయట గాని మేడపైన గాని యోగా భ్యాసం చేయాలి.