వరల్డ్‌ హార్ట్‌ డే: గుండె పనితీరు పదిలం

WORLD HEART DAY
WORLD HEART DAY

ప్రపంచ గుండె దినోత్సవాన్ని 2010 నుంచి సెప్టెంబర్‌ నెలలోని ఆఖరి ఆదివారం జరుపుకునేవాళ్లం. కానీ 2011వ సంవత్సరం నుంచి సెప్టెంబర్‌ 29వ తేదీని ప్రపంచ గుండె దినోత్సవంగా జరుపుకుంటున్నాం. కార్డియోవాస్క్యూలర్‌ డిసిసెస్‌ (సివిడి) స్ట్రోక్‌ ప్రివెన్షన్‌ పట్ల ప్రపంచ వ్యాప్తంగా అవగాహన తీసుకురావం ఇందులోని ముఖ్య ఉద్దేశ్యం. దానిలో భాగంగా 2000 సంవత్సరంలో వరల్డ్‌ హార్ట్‌ ఫెడరేషన్‌ రూపొందించిన విధి విధానాలతో అంతర్జాతీయంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. సివిడి స్ట్రోక్స్‌ అనేవి నాన్‌ కమ్యూనికబుల్‌ డీసీసెస్‌లో సంభవిస్తున్న మరణాలలో ప్రథమస్థానంలో ఉన్నాయి. మన హృదయం మన శరీరానికి అవసరమైన శక్తిని ఇవ్వడమే కాకుండా ప్రేమ, చిరునవ్ఞ్వ అనే భావాలతో సంపూర్ణంగా బతకడానికి సహకరిస్తుంది. అటువంటి హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవటం ఎంతో అవసరం. లేకపోతే మనల్ని మనం సివిడి ప్రమాదంలో వేసుకున్నట్లే. సివిడి అనేది గుండె సమస్యలు గుండెపోటులో భాగం.

ప్రతి సంవత్సరం 17.5 మిలియన్‌ మరణాలకు సివిడి కారణమవ్ఞతోంది. 2030 నాటికి ఆ సంఖ్య 23 మిలియన్లకు చేరవచ్చని అంచనా. మన జీవన విధానంలో చిన్నచిన్న మార్పుల ద్వారా అంటే ఆహారంలో మార్పులు, సరైన వ్యాయామం, ధుమపాయం మానేయడం ఇటువంటి వాటివల్ల మనం సిబిడిని అరికట్టవచ్చు. ప్రపంచ గుండె దినోత్సవం రోజు, మీరు మీ హృదయాన్ని ఎలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నారో అందరికి తెలియచేసి ఆదర్శంగా ఉండాలనేది మా ఉద్దేశ్యం.

కనుక మనం అందరం మన గుండె ఆరోగ్యం పట్ల శ్రద్ధగా ఉంటూ మన ఆరోగ్యంలో మంచి మార్పును తీసుకుని రావాలనేది మా ఆకాంక్ష. మీ హృదయాన్ని ఉత్తేజ అరచండి, మీ హృదయాన్ని కదిలించండి, మీ హృదయాన్ని ప్రేమించండి. మీ హృదయపు శక్తిని అందరికి పంచండి.

వ్యాయామం:

ఐసిఎంఆర్‌-ఇండియా బి రీసెర్చ్‌ ప్రకారం ఇదరిలో ఒకరు శారీరకంగా చురుకుగా లేరని తేలింది. సాధారణంగా పెద్ద వాళ్లలో బిపి కంట్రోల్‌లో ఉండడం కోసం వారంలో 40 నిమిషాల పాటు కనీసం 3-4 సెషన్స్‌ ఏరోబిక్స్‌లాంటివి చేయాలని సూచిస్తాం. కానీ ఇండస్ట్రియల్‌ సెట్టింగ్స్‌లో ఖాళీ సమయాలలో చేసే శారీరక కార్యాచరణ వలన ఇన్వర్స్‌ సోషల్‌ గ్రేడియంట్‌ రావడాన్ని గమనించాం.
డైట్‌: వయసు పెరిగేకొద్దీ బిపి వంటి వాటి ప్రభావం లేకపోవడం కోసం ఆహార నియమావళిలో కొన్ని మార్పులను సూచించాం. తాజా పళ్లు కూరగాయలు, తక్కువ కొవ్ఞ్వ కలిగిన పాల పదార్థాలు, పౌల్ట్రీ పదార్థాలు, చేపలు, తక్కువ చక్కెర తీసుకోవడం ఎర్రని మాంస పదార్థాలు తీసుకోవడం తగ్గించడం లాంటివి సూచించాం.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/nri/