హెయిర్‌కు మసాజ్‌ అవసరమే

Hari Massage


ఈ కాలంలో చుండ్రుకు అవకాశాలు ఎక్కువ. ఈ కారణంగా జుట్టు ఎక్కువశాతం రాలిపోతుంటుంది. జుట్టు ఈ వాతావరణానికి పేలవంగా, రఫ్‌గానూ తయారవ్ఞతుంది. అలాంటి జుట్టును మృదువ్ఞగా మార్చుకోవడానికి కొన్ని చిట్కాలు…
తేలికపాటి షాంపూలు కొద్దిగా మాత్రమే ఉపయోగించాలి. కఠినమైన షాంపూలు శిరోజాల్లోని సహజమైన నూనెల్ని హరించి వేస్తాయి.
అలాగే బాగా వేడి నీటిని తలపై పోసుకోకూడదు. షాంపూ చేసుకున్న తర్వాత కండీషనర్‌ అప్లయి చేయాలి. లేదా కండీషనర్‌ కలిసి ఉన్న షాంపూను ఎంచుకోవాలి. హెయిర్‌ డ్రయర్‌ను జుట్టుకు కనీసం పది అంగుళాల దూరంలో ఉండాలి. అసలు వాడకుండా ఉంటే ఇంకా మంచిది. వారానికి రెండుసార్లు తలకు నూనె పెట్టుకుని, ఆ నూనెను రాత్రంతా అలా ఉంచేయాలి.
వారానికి రెండుసార్లు పెరుగు లేదా గుడ్డులోని పచ్చసొన పొడి జుట్టుకు అప్లయి చేస్తే కేశాలు మృదువ్ఞగా ఉంటాయి. కొబ్బరినూనె, నువ్వులు లేదా ఆలివ్‌ ఆయిల్‌ కలిపి వేడిచేసి మాడుకు, శిరోజాలకు పట్టించి వేడినీటిలో ముంచిన టవల్‌ తలకు చుట్టుకోవాలి. ఐదు నిమిషాలుంచి, మరోమారు టవల్‌ను వేడినీటిలో ముంచి చుట్టుకుని కొద్దినిమిషాలు ఉంచుకోవాలి.
ఇలా చేయడం ద్వారా మాడు నూనెను బాగా గ్రహిస్తుంది. పొడిగా, పేలవంగా జుట్టు ఉన్నట్లయితే ఒక కప్పు తేనె, అరకప్పు ఆలివ్‌ ఆయిల్‌ లేదా నువ్ఞ్వల నూనె కలిపి ఓ రాత్రంతా ఉంచేసి కొద్దిగా తీసుకుని తలకు మసాజ్‌ చేయాలి.