మహిళలే శక్తిమంతులు

Women Empowerment
Women Empowerment

మహిళలు ఎంత చదువ్ఞకున్నా, ఎంతగా సంపాదిస్తున్నా తాము చెప్పినట్లే వినాలని, వారు బలహీనులని పురుషులు భావిస్తుంటారు. తమ శక్తితో పోల్చుకుంటే వారు శక్తిమంతులు కారని అనుకుంటారు. వారిని చెప్పుకింద తేళ్లుగా భావించాలని కొంతమంది భర్తలు అంటుంటారు. అంతేకాదు శారీరకంగా స్త్రీలు బలహీనులుగా అనుకుంటారు. ఇలాంటివారంతా తమ ఆలోచనలు సరైనవి కావని తెలుసుకోవాలి. ఎందుకంటే శాస్త్రీయ పద్ధతుల్లో నిర్వహించిన కొన్ని అధ్యయనాలు కూడా అనేక విషయాల్లో మగవాళ్లకంటే ఆడవాళ్లే మందున్నారని చెబుతున్నాయి. నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ నిర్వహించిన తాజా అధ్యయనం ప్రకారం కరవులు, అంటు వ్యాధులు లాంటివి ప్రబలినప్పుడు మగవాళ్లకంటే స్త్రీలు వాటిని సమర్థవంతంగా తట్టుకొని జీవించగలరని తేలింది. మగవాళ్లతో పోలిస్తే ఆడవాళ్ల ఆయుర్థాయం కూడా ఎక్కువే. ఇంగ్లీష్‌ మాట్లాడే దేశాల్లోని మహిళల సగటు ఆయుర్థాయం 83.1ఏళ్లుంటే, మగవాళ్ల సగటు ఆయుర్థాయం 79.5 ఏళ్లుగా ఉంది.

చరిత్రలో ప్రజలు అత్యంత క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్న ఏడు సందర్భాలను సదరన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ డెన్మార్క్‌ ప్రొఫెసర్లు అధ్యయనం చేశారు. వాటి ఆధారంగా పరిస్థితులను ఎదుర్కొన్న ఏడు సందర్భాలను సదరన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ డెన్మార్క్‌ ప్రొఫెసర్లు అధ్యయనం చేశారు. వాటి ఆధారంగా పరిస్థితుల ప్రభావం మగవాళ్లు, ఆడవాళ్ల ఆయుర్థాయంపైన ఏ విధంగా ఉందో ప్రయత్నం చేశారు. 1845-1849 మధ్య సంబవించిన ఐరిష్‌ కరవు, 1846, 1882లో ఐస్‌లాండ్‌లో ప్రబలిన అంటు వ్యాధులు, 19వ శతాబ్ధం ప్రారంభంలో అమెరికాలో బానిసలుగా బతికిన ఆఫ్రికన్లు….ఇలా కఠినతరమైన పరిస్థితులను ఆడామగా ఎదుర్కొన్న తీరును కేస్‌ స్టడీలుగా తీసుకున్నారు. ఇవన్నీ కూడా మనుషులు ఆయుర్థాయంపై ప్రభావం చూపిన పరిస్థితులే. ఐస్‌లాండ్‌ అంటు వ్యాధులనే తీసుకుంటే ఆసమయంలో మహిళల సగటు ఆయుర్థాయం 18.83ఏళ్లకు, పురుషుల సగటు ఆయుర్థాయం 16.76 ఏళ్లకు పడిపోయింది. ఇలా అన్ని సందర్భాల్లోనూ ఆడవాళ్ల ఆయుర్థాయమే ఎక్కువనీ, కఠిన పరిస్థితుల్లో ఆడవాళ్లే ఎక్కువ కాలం జీవించారని తేలింది. పుట్టిన కొద్దిరోజులకే తలెత్తే వ్యాధులను కూడా మగ శిశువులతో పోలిస్తే ఆడ శిశువులు సమర్థంగా తట్టుకోగలరనీ, ఆ ప్రభావం సగటు ఆయుర్థాయంపైనా స్పష్టంగా కనిపిస్తోందని అధ్యయనాలు చెబుతున్నాయి. మొత్తమ్మీద చూస్తే అనేక పరిస్థితుల్లో శారీరకంగా ఆడవాళ్లు శక్తివంతులుగా కనిపిస్తున్నారని అధ్యయనకర్తలు తేల్చారు. వివిధ వాతావరణ, సామాజిక పరిస్థితుల ప్రభావం కూడ ఆడవాళ్ల ఆయుర్థాయంపై ఉంటుందని వాళ్లంటు న్నారు. హర్మోన్లలో తేడా కూడా స్త్రీలు, మగవాళ్ల మరణాలపై ప్రభావం చూపుతుందన్నది అధ్యయనకర్తల మాట. మహిళల్లో అధికంగా ఉండే ఈస్ట్రోజెన్లు ఆరోగ్యంపైన సానుకూల ప్రభావం చూపుతాయి. మరోపక్క మగవాళ్లలో ఎక్కువగా ఉండే టెస్టోస్టెరాన్‌, వ్యాధిక నిరోధక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. మరణశాతం ఎక్కువగా ఉన్న సందర్భాల్లోకూడా, మగవాళ్లకంటే ఆడవాళ్లే ఎక్కువ కాలం జీవించారని అధ్యయనకర్తలు తేల్చారు. మొత్తం మీద ఆడవాళ్లే శక్తిమంతులని అధ్యయనాలు చెబుతున్నాయి.