ఇలా బరువు తగ్గండి

Weight Reduction
Weight Reduction

అధిక బరువు చాలామందిని వేధించే సమస్య. ‘అలాంటివారు ఈ ఎనిమిది సూత్రాలూ పాటించండి. శ్రమలేకుండానే బరువ్ఞ తగ్గిపోతారు అంటున్నారు బ్రిటిష్‌ పోషకాహార నిపుణులు.
్య బరువ్ఞ తగ్గాలనుకునేవారు వారానికి ఒకరోజు అన్ని పూటలూ భోజనానికి బదులుగా కూరగాయాలూ, ఆకుకూరల సలాడ్‌ తీసుకుంటే ఫలితం ఉంటుంది. అంతేకాదు, ఆ పోషకాలూ విటమిన్లతో చర్మానికి నిగారింపూ పెరుగుతుంది.
తగిన చోటు, సమయం చూసుకొని కూర్చొనే భోంచేయాలి. దాంతో ఆహారాన్ని బాగా నములుతారు. ఫలితంగా త్వరగా జీర్ణమవ్ఞతుంది.
్య సాధ్యమైనంత చిన్నసైజు ప్లేటులో భోంచేస్తే మీకు తెలియకుండానే పూటకు కనీసం 250 కేలరీలైనా తగ్గించి తింటారు.
్య నిద్రలేచిన గంటలోపే బ్రేక్‌పాస్ట్‌ పూర్తిచేయడం మంచిది. ఆలస్యంగా తినడం వల్ల రెండు భోజనాల మధ్య సమయం తగ్గి కొవ్ఞ్వ పెరుగుతుంది.
్య రోజూ పాల ఉత్పత్తులు ఎంతోకొంత పరిమాణంలో తీసుకోవాలి. వీటిలోని కాల్షియం, కొవ్ఞ్వని కొంతమేరకు తగ్గించగలదు.
్య వ్యాయామం చేసిన తర్వాత 30-60 నిమిషాలలోపు భోంచేయడం మేలు. కొత్తగా చేరే క్యాలరీలను శరీరం అలసిపోయినపుడు వెంటనే ఉపయోగించుకుంటుంది.
్య భోజనానికి ముందు నారింజలాంటి నిమ్మజాతి పండు సగం తింటే బరువ్ఞ తగ్గుతారని ఓ పరిశోధన.