జనం మెప్పులే ఈస్థాయికి చేర్చాయి

Vinjamoory Anasuyadevi
Vinjamoory Anasuyadevi


ప్రముఖ జానపద, శాస్త్రీయ లలిత సంగీత గాయని వింజమూరి అనసూయాదేవి అంటే తెలియని వారుండరు. పాతతరం వారికి ఆమె అంటే ఎనలేని అభిమానం. ఆమె పాలు వింటే ఆకాశంలో ఎగిరే పక్షులు సైతం చెట్లపై వాలిపోయి, ఆమె రాగాలు వినేందుకు పోటీపడతాయి. తమ రెక్కల చప్పుడుకు ఆమె స్వరం వినేందుకు ఆటంకంగా భావించి, నిశ్శబ్దంగా రివ్ఞ్వను చెట్టుకొమ్మలపై విశ్రమించి, ఏకాగ్రతంగా, అభిమానంగా వింటాయి అంటే ఊహించవచ్చు ఆమె ఎంత మధురమైన గాయని అని. జానపవ గేయాలు రాయడంలో, బాణీలు కట్టడంలో, పాడడంలో అనసూయాదేవి ప్రావీణ్యం సాటిలేనిది. అనసూయా 1920 మే 12న కాకినాడలో జన్మించారు. ఆమెకు ఐదుగురు సంతానం. కవి స్వర్గీయ దేవులపల్లి కృష్ణశాస్త్రి మేనకోడలు కూడా. తొమ్మిదవ ఏటనే జానపదాలకు, భావగీతాలకు బాణీలు కట్టి ప్రాణ ప్రతిష్ట చేసిన అపరబ్రహ్మా అనసూయా. మేనమామ కృష్ణశాస్త్రి రచించిన ప్రాభాత ప్రాంగణాన గీతాన్ని ఒకే రోజు ఆరు వేదికల్లో ప్రత్యక్షంగా పాడిన దివ్యగాయిని. గాంధీజీ సమక్షంలోనూ అనసూయ గీతాలాపన చేశారు. తొమ్మిది దశాబ్ధాలు పూర్తయిన కూడా పసిపిల్లలకు ఉండే ఉత్సాహం పొగోట్టుకోని చిన్ని శిశువు. ఆమె జీవనరాగంలోని సరిగమల్ని ఆమె చెప్పిన క్రమంలోని వినడం శ్రావ్యంగా ఉంటుంది.
మొదటి స్వాతంత్య్ర దినం నేను మర్చిపోలేని రోజు. గతకొద్దికాలం క్రితమే అమెరికాలో తన తుదిశ్వాసను వదిలారు.
లైవ్‌లో పాడిన అనసూయ
కార్యక్రమంలోనూ ఒకే రోజున అన్నీ లైవ్‌గా పాడాను. ఆ రోజే మరో చిత్రమైన సంఘట. నాకు అలంకరణ అంటే చాలా ఇష్టం. నేనే ఒక ఫ్యాషన్‌ క్రియోట్‌ చేశాను. 5గజాల తెల్ల చీర కొనుక్కుని వచ్చి, ఎరుపు ఆకుపచ్చ రంగుల శాటిన్‌ రిబ్బన్లు కొనుక్కుని వచ్చి వాటిని పొడవుగా కట్‌ చేసి చీర మీద నిలువు చారలు వేసుకున్నాను. జాకెట్‌కి కూడా బార్డర్‌ వేసుకున్నాను. టైలర్‌ని రాత్రింబవళ్లు కూచోపెట్టి దగ్గరుండి కుట్టించుకున్నాను. నా పాటలాగే నా డ్రస్‌ కూడా హిట్‌ అయ్యింది.
అయ్యో కుయ్యోడో నా మొదటి పాట
చిన్నపుడే నేను నా చెల్లి సీత కలిసి మొదలుపెట్టాం. సుమారు 23 ఏళ్లు కలిసి పాడాం. నేను జానపదాల మీద పరిశోధన చేద్ధామనుకున్నాను. నా సంగీత గురువు మునిగంగి వెంకట్రావుపంతులు. ఆయన నాకు క్షేత్రయ్య పదాలు నేర్పారు. ఆ పదాల మీద రీసెర్చ్‌్‌ చేద్దామనుకున్నాను. నాకు ఫోక్‌ ఇష్టం. అప్పటికే చాలా జానపదాలు రాశాను, పాడాను. అలా సుమారు 30 ఏళ్లు పాడాక రేడియోలో జానపదాలు మొదలుపెట్టాక నాకు అవకాశం వచ్చింది. నేను పాడిన మొదటి పాట ‘అయ్యోకుయ్యోడో హిట్‌ అయ్యింది. కృష్ణశాస్త్రిగారు పాటలు రాసేవారు. నాకు నేర్పిందీ నన్ను తీర్చింది కర్ణాటక సంగీతమే. తొమ్మిదవ ఏటనే రెండు మూడు వందల పాటలకి రాగాలు కట్టాను. అందరికీ తెలిసిన ‘మొక్క జొన్న తోటలో నేనే రాగం కట్టి పాడాను. 1931లో రాజమండ్రి నాధం వారి సభలో, కాకినాడ సభలో జానపదాలను పాడాను. అలాగే రేడియోలోనూ ఆ జాన పదాలు ప్రసిద్ధి చెందేలా కృషి చేశాను.
‘చెత్తపాట పాడిస్తున్నారు అన్నారు!
జానపద గీతాలన్నీ జానపదులు పడినట్లే పాడగలను. త్యాగరాజు ఎలా పాడాడో తెలీదు. నగుమోములాంటివి బాలమురళి బాగా పాడాడు. జానపదాలను బాగా పాడి, బాగుందనిపించి, సభల్లో ప్రవేశపెట్టాను. అప్పుడు ఎన్నో కాంప్లిమెంట్స్‌ వచ్చాయి. క్షేత్రయ్య పదాలలాగ కొటిరత్నపు ముద్దు కోమలాంగి అనే గీతాన్ని పాడాను. ఆ పాటని ముందుగా అమ్మకి వినిపించి, ఆవిడ బావుందని అన్నాకే బయట పాడాను. అమ్మ అనుమతి ఇచ్చాక, నాకు బలం వచ్చింది. ఆ పాట విన్నాక ఒక కవయిత్రి నాళం వారి సభలో పాడుతుంటే ఆక్షేపించారు. అమ్మ వెంటకరత్నంతో కవి కుటుంబంలో పుట్టిన మీరు మీ అమ్మాయి చేత చెత్త పాట పాడిస్తున్నారు అని అన్నారు.
నన్ను ప్రొత్సహించింది రజనీకాంతరావు. దేశ విదేశాల్లో జానపదాలు ప్రచారం చేసింది మాత్రం నేనే. కచేరీలకు సిలోన్‌, లండన్‌, పారిస్‌ దేశాలకు వెళ్లాను. పారిస్‌లో నాకు ‘క్వీన్‌ ఆఫ్‌ ఫోక్‌ మ్యూజిక్‌ అని బిరుదు ఇచ్చారు. 1977లో అమెరికాలో మొట్టమొదటి తానా సభలో పాడాను. అక్కడే 23 కచేరీలు చేశాను. ఆ కచేరీలను 22 శృతులతో పోల్చి, అమెరికాలో నా సంగీత యాత్ర అని పుస్తకం రాశాను. రేడియోలో రూ. 250 జీతం. చిన్నప్పటి నుంచి కొత్త పాటలు సరదా. ఒక కాంపిటిషన్‌లో నేను వేరేదో పాడుతుంటే నన్ను పిలిచి నీకు త్యాగరాజ కీర్తనలు రావా అని అడగగానే ‘నిధి చాల సుఖమా పాడాను. అది విన్న వారు ‘పిట్ట కొంచెం, కూత ఘనం అన్నారు. మద్రాసు పంపిస్తే సినిమాలో పాడిస్తాం అన్నారు. ఆడపిల్లను ఒక్కతినే పంపడం ఇష్టం లేదని నాన్నవాళ్లు అనడంతో మా కుటుంబం అంతా రావడానికి ఏర్పాటు చేశారు. అప్పుడు నా చేత కిట్టమ్మా గోపాలబాలా కిట్టమా పాడించారు. నేను కచేరి ఇచ్చేటపుడు ముందుగా క్లాసికల్‌, భావగీతాలు, తరువాత చివరలో ఒక జానపద గీతం పాడేదానిని. నాకున్న ఇంట్రెస్ట్‌ కారణంగా జానపదాలు పాడాను. రేడియో పని మీద నా చెల్లి సీత వెడుతున్నపుడు నేను కూడా సీతతో వెళ్లి చాలా సేకరించాను. అన్నీ సేకరించాక వాటి మీద పరిశోధన చేద్ధామనుకున్నాను. అయితే నా రీసెర్చ్‌ కొన్ని కారణాల వల్ల కుదరలేదు. నా పాటల స్వరాలన్నీ నేను బుక్‌గా రాసిపెట్టుకున్నాను. సంగీత నాటక అకాడమీ వాళ్లు దాన్ని పబ్లిష్‌ చేశారు, పునర్‌ ముద్రణ కూడా చేశారు. 1938లో ఆలిండియా రేడియా ప్రారంభోత్సవం నాడు ‘రారమ్మ రారమ్మ అని ముగింపులో ‘పోయినది దానిమ్మ అని నాచేత పాడించారు. 1939లో ఊర్వశీలో పాటలు ప్లే బ్యాక్‌ లేకపోయినా కూడా నేను పాడాను. అదోక క్రెడిట్‌. అది రేడియో వారిదే. ఉత్తర రామచరితంలో లక్ష్మణమూర్చలో పద్యాలు చదువుతుంటే ఎస్‌ ఎన్‌ మూర్తికి నాకు ఉద్యోగం ఇస్తానన్నారు. 250రూ.ల. జీతం అన్నారు. 1940 లో చేరారు. రేడియోలో ఊర్వశీ, విద్యావతి, శ్రీకృష్ణుడు, నవరసాలు, గోదాదేవి, దక్షయజ్ఞం మొదలైన దేవులపల్లి వారి నాటకాలు వేశాం. ఓ పక్కన నవ్వ సాహిత్య పరిషత్‌లో కచ్చేరిలు చేసేవాళ్లం. వెన్నెల్లో బ్రహ్మాసమాజంలో పాడేవాళ్లం. ఆ తర్వాత ఉద్యోగంలోంచి మామయ్య, నాన్న నన్ను వెనక్కి తీసుకువెళ్లిపోయారు. 1943లో బి.ఏ చేశాను. పి.సుబ్రహ్మణ్యం గారు నా పాట విని నర్తన మురళిలో పాడడానికి మద్రాసు తీసుకెళ్లారు. 1945లో వివాహం జరిగింది. అనసూయ పెళ్లి కబుర్లు అని అందరికి మామయ్య చేప్పేవారు. మాధూదయంలో అనే పాట నా మీదే రాశారు. కొన్నాళ్లు స్టెల్లామేరీస్‌లో మ్యూజిక్‌ లెక్చరర్‌గా చేశారు. కళాక్షేత్రంలో ఆఫర్‌ వచ్చింది వదిలేశాను. అన్నమయ్య పాటలను రాళ్లపల్లి అనంతకృష్ణశర్మగారు బయటకి తీసుకొచ్చినపుడు ఆ పాటలకు నన్ను ట్యూన్‌ చేసి పాడమన్నారు. అందుకోసం తాళ్లపాక రమ్మన్నారు. ఆ టైమ్‌లో మా వారికి చెయ్యి విరిగింది. మా అమ్మాయికి బాగా జ్వరంగా ఉంది వెళ్లలేకపోయాను. బదులుగా మల్లిక్‌ వెళ్లారు. పాడగలిగినా ప్లే బ్యాక్‌కి వెళ్లలేదు. ట్యూన్‌ చేయగలిగినా చేయలేదు, యాక్ట్‌ చేయగలిగినా చేయలేదు. అయిన వాటి గురించి బాధపడి లాభం లేదు. చేయవలసినవి చాలా ఉన్నాయి. తొందర పడుతున్నాను చేయడానికి. దక్షిణభారతంలో నేనే మొట్టమొదటి సంగీత దర్శకురాలిని. హార్మనీ పట్టుకుని వాయిస్తూ పాడతాను. స్త్రీల పాటలు పాడితే, సెంట్రల్‌ గవర్నమెంటు వారు ఫెలోషిప్‌ ఇచ్చారు. పెళ్లి పాటలు, సరదాపాటలు, మేలుకోలుపులు, లాలిపాటలు, గొబ్బిపాటలు, కోలాటం, మంగళహారతులు, పండుగలు, పూజలు, అన్నింటినీ మ్యూజిక్‌ నోటేషన్‌తో చేశాను. సంగీతం గొప్ప గనిలాంటిది. ఎంత తవ్వితే అంత వస్తుంది.
అలాగే కలెక్ట్‌ చేశాను. ఎక్కడ వింటే అక్కడ పెట్టేసేదాన్ని. వీలునామాలో ‘అంతిమ యాత్ర ఘనంగా చెప్పడం కాదు కానీ, పల్లేల్లో ఉండే ఈ జాన పదాలకు బాణీలు కట్టి జన బాహుళ్యం లోకి తేవడానికి తొలి ప్రయత్నం నాదే. ఆలిండియా రేడియో లో ప్రవేశపెట్టిందీ నేను. కానీ అప్పుడ పుడు అనిపిస్తుంది నాకు రావలసిన గుర్తింపు రాలేదని. మామయ్య రాసిన మల్లీశ్వరీ సినిమా పాటలకి హార్మనీ పట్టుకుని ముందుగా బాణీలు కట్టింది కూడా నేనే. నా పాట విని వాహినిలో పాడతావా అని అడిగారు. వెంటను ఒప్పు కు న్నాను. పాట విని బియన్‌రెడ్డి గారు మెచ్చు కున్నారు.
నేను రాగం కట్టిన పాట జనం విని పొగిడితే సరదా. అప్పుడు ఉత్సా హంగా పాడతారు. అలాగే అలం కరణ బాగా సరదా.