మంచి అలవాట్లతో మానసిక ఆరోగ్యం

sadness

నేనొక శాపగ్రస్తురాలిని. మానసిక రోగుల మధ్య నలిగిపోతున్నాను. మా ఇంట్లో ఒక్కొక్కరిది ఒక సమస్య. మా అత్తగారికి అనుమానం ఎక్కువ. ప్రతిదానికి అనుమానించి వేధిస్తుంటుంది. మా మామగారు ఏదీ పట్టించుకోరు. ఎప్పుడూ తన గదిదాటి బయటకురారు. తనలోకం తనదే అన్నట్టు వ్యవహరిస్తుంటారు. మావారు ప్రతిదానికి వ్యాకులత చెంది ఒత్తిడికి గురవుతుంటారు. దీంతో పెళ్లయిన నాలుగేళ్లకే రక్తపోటు, మధుమేహం తెచ్చుకున్నారు.

మా ఆడపడచు పెళ్లయిన రెండేళ్లకే భర్తతో గొడవపడి విడాకులు ఇచ్చి పుట్టింటికి వచ్చేసింది. ఆమె బాత్‌రూమ్‌కు వెళ్తే అక్కడే గంటసేపు గడుపుతుంది. టిఫినైనా, భోజనమైనా గంటసేపు తింటుంది. మా అబ్బాయి ఇంటర్‌లో చేరినప్పటి నుంచి విపరీత ధోరణి ప్రదర్శిస్తున్నాడు. చదువంటేనే భయపడిపోతున్నాడు. చదవమని బలవంతం పెడితే రెచ్చిపోయి బూతులు తిడుతున్నాడు. అలాగే చేతిలో వ్ఞన్న వస్తువ్ఞలను విూదకు విసరడం, పగులగొట్టడం చేస్తున్నాడు. మా బాబు కోసం సైకియాట్రిస్టును కలిస్తే ఆయన కుటుంబ వివరాలు అడిగారు. అన్ని విని ఒక్కొక్కరిది ఒక రుగ్మత వ్ఞందని చికిత్స చేయించమని సలహా ఇచ్చారు. ఆ మాట చెపితే అందరూ నన్నే తిట్టారు. అయితే మా బాబు మాత్రం చికిత్స వల్ల కొంత మెరుగయ్యాడు.

ఇంటర్‌ పాసై, తర్వాత డిగ్రీలో చేర్పించాం. మళ్లీ చదువంటే భయమంటూ కాలేజీ మానేశాడు. నా వయసు 45 సంవత్సరాలు. మావారికి 47 సంవత్సరాలు. నేను ఇంటర్‌ వరకు చదివాను. ఇరవై ఏళ్ల వయసులోనే పెళ్లయినప్పటికి చాలా ఆలస్యంగా ఒక బాబు పుట్టాడు. లేకలేక పుట్టిన ఒక బాబును బాగా చదివించలేకపోతున్నాను. అలాగే మా ఇంట్లోని వారిలో ఒక్కరిని కూడా మార్చలేకపోతున్నాను. వీరందరితో వేగలేక నేను కృంగిపోతున్నాను. ఈ దశలో నన్ను నేను కాపాడుకుంటూ కుటుంబాన్ని నడిపించడం ఎలాగో అర్థం కావడం లేదు. అసలు మానసిక రుగ్మతలు ఎందుకు వస్తాయి. మానసిక ఆరోగ్యం పెంపొందించుకోవాలంటే ఏమి చేయాలో చెప్పండి. అలాగే మా కుటుంబ సమస్యలను పరిష్కరించుకోడానికి తగిన మార్గాలు సూచించండి. – స్రవంతి, విశాఖపట్నం.


అమ్మా, విూది సంక్ష్లిష్టమైన సమస్య. ఇంటిల్లిపాది మానసిక రుగ్మతలతో బాధపడుతుంటే కలిగే ఇబ్బంది వర్ణనాతీతం. ఆధునిక సమాజంలో మానసిక సమస్యలు, రుగ్మతలు పెరిగిపోతున్నాయి. జనాభాలో అధికశాతం మానసిక ఒత్తిళ్లకు గురవ్ఞతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ప్రతి 40 సెకన్లకు ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అకాల మరణాలకు కారణమవ్ఞతున్న గుండెపోటు, మధుమేహం, రక్తపోటు లాంటి శారీరక రుగ్మతలకు మానసిక ఒత్తిళ్లే ముఖ్యకారణమని నిపుణులు అంటున్నారు. ఆత్మహత్యలకు డిప్రెషనే 90 శాతం కారణమని మానసిక నిపుణులు తేల్చి చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ కూడా ఇప్పుడు మానసిక ఆరోగ్య కల్పన, పరిరక్షణ, నివారణ, చికిత్సలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అమెరికాలాంటి అభివృద్ధి చెందిన దేశాలలో మానసిక వైద్యశాలలు, కౌన్సెలింగ్‌ కేంద్రాలు విరివిగా వ్ఞన్నాయి. మనదేశంలో కూడా ఇప్పుడిప్పుడే మానసిక చికిత్సాకేంద్రాలు వేళ్లూనుకుంటున్నాయి. సహజంగా వ్యక్తిత్వ వైఫల్యాలు, ప్రవర్తనా లోపాలు, అదుపు చేయలేని ఉద్వేగాలు, వ్యసనాలు, స్కిజూఫ్రెనియా, సైకోసిస్‌ తదితర రుగ్మతలను మానసిక సమస్యలుగా గుర్తిస్తాం.

శారీరక, మానసిక, సామాజిక కుశలత లేదా సమత్యుత దెబ్బతినడాన్ని రుగ్మతగా భావిస్తాం. భయం, ఆందోళన, విచారం, వ్యాకులత అనుమానం, నిద్రపట్టకపోవడం, ఆకలి మందగించడం, ఏకాగ్రత కోల్పోవడం, ఉద్వేగాలు అదుపు తప్పడం, ఆత్మహత్య భావాలు చెలరేగడం లాంటి లక్షణాలు మానసిక రుగ్మతలకు చిహ్నాలుగా గుర్తిస్తాం.

పలు లక్షణాల ఆధారంగా రుగ్మతలను వర్గీకరించి, కౌన్సెలింగ్‌, చికిత్స చేస్తుంటారు. ప్రధానంగా మానసిక వైద్యులు, మానసిక నిపుణులు అంటే సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులు మానసిక సమస్యలకు చికిత్సలు, సూచనలు అందిస్తుంటారు. సాధారణ సమస్యలు, ఒకమోస్తరు రుగ్మతలకు సైకాలజిస్టుల ద్వారా కౌన్సెలింగ్‌ చేయించుకుంటే సరిపోతుంది. తీవ్రమైన, దీర్ఘకాలిక రుగ్మతలకు మానసిక వైద్యుల పర్వవేక్షణలో మందులు వాడాల్సి వ్ఞంటుంది. కొన్ని రుగ్మతలకు దీర్ఘకాలం మందులు వాడాల్సి వ్ఞంటుంది. కొన్ని సందర్భాలలో మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్‌ సమస్యలకు వాడినట్టు మానసిక రుగ్మతలకు జీవితకాలం మందులు వాడాల్సి వ్ఞంటుంది.

కాగా మానసిక రుగ్మతలకు పలు అంశాలు కారణాలుగా పరిణమిస్తుంటాయి. జన్యువ్ఞఉల, వంశానుగత లక్షణాలు, జీవనశైలి, హార్మోన్ల అసమతుల్యత, పెరిగిన వాతావరణం, పెంపకలోపం, ప్రతికూల భావాలు తదితర అంశాలు మనసును ప్రభావితం చేస్తాయి. మనసుపై ప్రతికూల ప్రభావాలు పెరిగినపుడు అది సమస్య లేదా రుగ్మతకు దారి తీయడానికి అవకాశాలు ఉన్నాయి. పిరికివారు, బలహీన సమస్యలు, శారీరక దుర్భలురు, విపరీతంగా సెంటిమెంట్లు వ్ఞన్నవారు తరతర అంశాలు మనసును ప్రభావితం చేస్తాయి. మనసుపై ప్రతికూల ప్రభావాలు పెరిగినపుడు అది సమస్య లేదా రుగ్మతకు దారితీయడానికి అవకాశాలు ఉన్నాయి. పిరికివారు, బలహీన మనస్కులు, శారీరక దుర్భలురు, విపరీతంగా సెంటిమెంట్లు వ్ఞన్నవారు త్వరగా రుగ్మతలకు గురవ్ఞతుంటారు.

అలాగే ఆధునిక సమాజంలో ఒత్తిడి, నిద్రలేమి, వ్యసనాలు రుగ్మతలకు మూలాలుగా మారుతున్నాయి. కాబట్టి ప్రతివారు తమ జీవనశైలి, విధానాలను పరిపుష్టం చేసుకోవడం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. సరళంగా చెప్పాలంటే మంచి అలవాట్లతో మానసిక ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. పోషక విలువలుగల తుల ఆహారం, చక్కని వ్యాయామం, సరిపడినంత నిద్ర, సామాజిక సంబంధాలు మనిషి శారీరక, మానసిక ఆరోగ్యానికి దోహదపడతాయి. జీవన వికాసం, శరీరక, మానసిక ఆరోగ్యానికి దోహదపడతాయి.

జీవన వికాసం, విజ్ఞానం, విలువలు, లక్ష్యాలు, సామాజిక స్పృహ, శాస్త్రీయ దృక్పధం, సానుకూల ఆలోచనలు మానసిక ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో తోడ్పతాయి. ఒత్తిళ్ల నిర్వహణ, నిర్ణయాత్మక శక్తి, సమస్యల పరిష్కారయుక్తి అలవర్చుకున్నవారిని మానసిక రుగ్మతలు దరిచేరవ్ఞ. అందుకే బాల్యం నుంచి పిల్లలను ఆహ్లాదకర వాతావరణంలో పెంచాలి.

ఆటపాటలు, స్నేహసంబంధాలు అలవర్చాలి. వివేకవంతులుగా పెంచాలి. ఇక విూ ఇంటి విషయానికి వస్తే అందరికి కౌన్సెలింగ్‌ తప్పనిసరి అనిపిస్తున్నది. అలాగే విూ అత్త, ఆడపడచులకు మానసిక వైద్యం అవసరమనిపిస్తున్నది. విూ వారికి ఎలాగూ మందులువాడుతున్నందున యోగ, ధ్యాన సాధన ఉపయోగపడతాయి. విూ అబ్బాయికి కౌన్సెలింగ్‌ లేదా హిప్నోథెరపి చేయిస్తే సరిపోతుంది. విూరు ఆత్మవిశ్వాసం పెంపొందించుకుని, అందరిని మార్చడానికి ప్రయత్నించండి. విూరు మరీ కృంగుబాటుకు గురవ్ఞతుంటే మాత్రం కౌన్సెలింగ్‌ తీసుకోండి.

Dr. N.B. Sudharkar Reddy, psychologist

తాజా స్వస్థ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/health/