సెల్‌ఫోన్లతో ఆరోగ్యం బుగ్గిపాలు

Driwing with Cell talk
Cell Phone Driving

పాఠశాలలను ఎగొట్టి మరీ గంటల తరబడి వారు ఈ ఆటలో మునిగి తేలేలా బానిసలుగా మార్చుతోంది. యువతలో వివిధ శారీరక, మానసిక ఆనారోగ్యాలకు కారణమవుతుండడంతో మానసిక వైద్యులు ఆందోళన చెందుతున్నారు.

ఓ యువతిని తన పిల్లల్ని పట్టించుకోవడం మానేసి, నిత్యం టిక్‌టాక్‌లో మునిగిపోయేది. దీన్ని గమనించిన భర్త ఆమెను గద్దించాడు. దీంతో ఆమె టిక్‌టాక్‌లో వీడియోను తీస్తూ, ఆత్మహత్య చేసుకుంది. ఆ మధ్య తెలంగాణలో కూడా కొంతమంది తాము డ్యూటీలో ఉన్నామనే స్పృహను కోల్పోయి, టిక్‌టాక్‌లో సందడి చేసి, సస్పెండ్‌ అయ్యారు. సెల్ఫీ తీసుకునే మోజులో ముగ్గురు అబ్బాయిలు వెరైటీ కోసం రైల్‌పై నుంచి తీసుకునేందుకు ప్రయత్నించారు. పైన ఎలక్ట్రికల్‌వైర్లు తగిలి, విద్యుత్‌షాక్‌తో ఆ ముగ్గురు మరణించారు. నదులపక్కన, సముద్రాల పక్కన, కొండలు వంటి ప్రమాదకర ప్రదేశాల్లో సెల్ఫీల కోసం ప్రయత్నిస్తూ, మరణించిన వారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. ప్రస్తుతం ప్రపంచంమంతా సెల్‌మయం. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరి చేతుల్లోనూ ఆండ్రాయిడ్‌ ఫోన్లే దర్శనమిస్తున్నాయి. ఇప్పుడు ఇవి భవిష్యత్తును నిర్ధేశిస్తున్నాయి. సెల్‌ఫోన్‌ను అవసరం మేరకు ఉపయోగించేవారు పనులు పూర్తి చేసుకుంటున్నారు. సెల్‌నే ప్రపంచంగా భావించేవారు భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు.

సెల్‌ గేమ్‌లలో మునిగిపోయి జీవితాలను చిత్తు చేసుకుంటున్నారు. కొన్నిసార్లు ప్రాణాలను తీసుకుంటున్నారు. సెల్‌లో వచ్చే ఆటలకు అధికమంది పిల్లలు, యువత బానిసలవుతు న్నారని, ఆరోగ్యం పాడుచేసుకుంటున్నారని మానసిక నిపుణులు చెబుతున్నారు. తల్లిదండ్రులు మేలుకోకుంటే పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకమని హెచ్చరిస్తున్నారు. బ్లూ వేల్‌ చాలెంజ్‌ గేమ్‌. ఇది ఒక ఆన్‌లైన్‌ వీడియో గేమ్‌. 50 రోజుల పాటు సాగే బ్లూవేల్‌ గేమ్‌లో చివరి టాస్క్‌ ఆత్మహత్య చేసుకోవడం. ఈ గేమ్‌లో ఏడాదిన్నర కిందట మహారాష్ట్రలో ఒకరు, పశ్చిమబెంగాల్‌లో మరొక పాఠశాల విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించి ఆ ఆటను ఇండియాలో నిషేధించింది. అయితే.. ఇది జరిగిన కొద్ది నెలల వ్యవధిలోనే మరికొన్ని ఆన్‌లైన్‌ వీడియో గేమ్‌లు విద్యార్థులు, యువత జీవితాలతో ఆటలాడుకుంటున్నాయి.

తాజాగా పబ్‌జీ ఉరఫ్‌ ‘ప్లేయర్‌ అనోస్‌ బ్యాటిల్‌ గ్రౌండ్‌.. దేశంలో ప్రస్తుతం యువతను, ప్రత్యేకించి స్కూల్‌ విద్యార్థులను ఆ లోకంలో ముంచేస్తున్న ప్రమాదకర అన్‌లైన్‌ మొబైల్‌ గేమ్‌ ఇది. ఆత్మహత్యల వైపు ప్రేరేపించిన బ్లూ వేల్‌, పోకెమాల స్థాయిలో కాకున్నా పబ్‌జీ విద్యార్థులను, హింస నేరప్రవృత్తి స్వభావంవైపు పురిగొల్పుతోంది.
పాఠశాలలను ఎగొట్టి మరీ గంటల తరబడి వారు ఈ ఆటలో మునిగి తేలేలా బానిసలుగా మార్చుతోంది.
యువతలో వివిధ శారీరక, మానసిక ఆనారోగ్యాలకు కారణమవుతుండడంతో మానసిక వైద్యులు ఆందోళన చెందుతున్నారు.

ప్రమాదంలో యువత

ఇది దక్షిణ కొరియాకు చెందిన ఓ వీడియో గేమింగ్‌ కంపెనీ తీసుకొచ్చిన ఆన్‌లైన్‌ మల్టీప్లేయర్‌ గేమింగ్‌ యాప్‌. ఈ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని గేమ్‌లో ప్రవేశించగానే ఒక ఐడీ వస్తుంది. ఇది ఎక్కువగా ఒక జట్టుగా ఆడే గేమ్‌. ఎంతమందితో ఆడాలి అనేది ముందే దీన్ని ఆడేవారు నిర్ణయించుకుంటారు. ఈ గేమ్‌ ఆడేవారు ప్రత్యేక సైనిక వేషధారుల్లా మారిపోతారు. అలాగే, ఇది గ్రూప్‌ వాయిస్‌ గేమ్‌. అంటే ఈ గేమ్‌ ఆడేవారంతా ఎప్పటికప్పు మాట్లాడుకునే వెసులుబాటు ఈ యాప్‌లో ఉంది. ఈ గేమ్‌లో గరిష్టంగా వంద మంది ఉంటారు.

దీన్ని ఆడేవారు ఏర్పాటు చేసుకున్న జట్టు తప్ప మిగిలిన వారంతా శత్రువుల కిందే లెక్క. దీంతో ఈ గేమ్‌ ఒక యుద్ధక్షేత్రాన్ని తలపిస్తుంది. గతంలో ఈ తరహా గేమ్స్‌ కేవలం ధనిక వర్గాలకే పరిమితం కాగా.. ప్రస్తుతం అందరి దగ్గర హస్త భూషణంగా మారిన ఆండ్రాయిడ్‌ ఫోన్లతో ఈ సంసృతి మరింత పెరిగింది. ఒక సారి ఆడితే చాలు మనకు తెలియకుండానే బానిసలైపోతాము. ఇంట్లో ఖాళీగా ఉండే ఆండ్రాయిడ్‌ ఫోన్లలో వింత వింత వీడియో గేమ్స్‌ను డౌన్‌లోడ్‌ చేస్తున్న చిన్నారులు వాటిలో పూర్తిగా నిమగ్నమైపోతున్నారు. చివరికి ఆహారం తీసుకునేందుకు విముఖత చూపే స్థాయికి చిన్నారులు దిగజారిపోతున్నారు.

తాజాగా ఇంటర్నెట్‌ను అనుసంధానం చేస్తూ అందుబాటులోకి వచ్చిన ఆన్‌లైన్‌ వీడియో గేమ్‌లు మరింత ప్రమాదకరంగా మారాయన్నది మానసిక నిపుణుల వాదన. ఒక్కసారి అలవాటు పడితే రోజుల తరబడి అదే ధ్యాసలో ఉండిపోతున్నారు పిల్లలు. దీనికి సెల్‌ కంపెనీలు ప్రకటిస్తున్న ఇంటర్నెట్‌ ఆఫర్‌లు మరింత ఆజ్యం పోస్తున్నట్లవుతోంది. తక్కువ మొత్తానికే రోజుల తరబడి ఇంటర్నెట్‌ వాడుకునే అవకాశం కల్పించడంతో తల్లిదండ్రుల అంతగా పట్టించుకోవడం లేదు.

దీంతో ఇదే అదనుగా ఇంట్లో చిన్నారులు నెట్‌కు అనుసంధానమై గేమ్స్‌ భూతంలో చిక్కుకుంటున్నారు. ఒక నదిలో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న ఓ యువకుడు హఠాత్తుగా తన పక్కన ఓ ముసలాయన నదిలో పడేందుకు ప్రయత్నిస్తున్నాడు. వెంటనే ఆ యువకుడు తేరుకుని, ఆ వృద్ధునిడి ఆత్మహత్య నుంచి కాపాడాడు. ఇలాంటి మంచి సంఘటనలు అరకొరగా జరుగుతుంటాయి.