సమయోచితంగా మసలు కోవాలి

women in
women in

సమయోచితంగా మసలుకోవాలి

కొన్ని పరిస్థితులను మార్చడానికి వీలుకాకపోవచ్చు. కష్టం కావచ్చు. కాని, మన ఆలోచనలను, అభిప్రాయాలను సందర్భోచితంగా మార్చుకోవడం, సమయోచితంగా వ్యవహరించడం మన చేతుల్లో ఉన్న పని. ఆవేశాలను నిరోధించుకోవడం, నియంత్రించుకోవడం మనకు చేతనైన పని. అన్ని వేళలూ, అన్ని పరిస్థితులూ మనకు అనుకూలంగా ఉండవ్ఞ. విషమ పరిస్థితులు ఎదురైనప్పుడు ఆవేశాలు ప్రదర్శించి అనర్థాలు కొని తెచ్చుకోవడం కంటే, సమయానుకూలంగా అణగిమణగి ఉండడం శ్రేయస్కరం. వివేకవంతులు అనుసరించే ఉత్తమమార్గం ఇది. ఆవేశంతో వ్యవహరిస్తున్న వాళ్లతో వాదించడం, వాళ్లను ఒప్పించి మెప్పించడానికి ప్రయత్నించడం వృథా ప్రయాస. ఉద్రేకంతో ఉన్నప్పుడు మనుషుల ఆలోచనలు వక్రమార్గం పడతాయి. తాము నమ్మిందే న్యాయమని, తాము అనుకొన్నదే యధార్థమని నిర్ణయాలకు వస్తారు. ఎదుటివాళ్లు ఎంత హేతుబద్ధంగా వాదించినా, ఎంత నమ్రతతో నచ్చజెప్పినా వాళ్లు తమధోరణి మార్చుకోరు. అలాంటి స్థితిలో వాళ్లతో వాదోపవాదాలకు దిగితే, సహనం కోల్పోయి మనం కూడా భావోద్వేగాలకు బానిసలయ్యే ప్రమాదం ఏర్పడవచ్చు. పరిస్థితి విషమించవచ్చు. అంచేత ఉద్విగ్నుడై ఉన్న మనిషిని ఉపశమింపజేసే ప్రక్రియగా తాత్కాలికంగా అతనితో ఏకీభవించి, తల ఊపడం ఒక మార్గం. లేదా మౌనం వహించి దూరంగా వెళ్లిపోవడం రెండవ విధానం. అతడు అక్కసు వెళ్లగ్రక్కి, శాంతించిన తర్వాత విషయాలను చర్చించుకొంటే ప్రయోజన చేకూరుతుంది. మనుషుల పట్ల, సమాజం పట్ల, జీవితం పట్ల మనకు అర్థవంతమైన అవగాహన అవసరం. మన ఆలోచనలు లోప పూరితంగా ఉంటే మనలో అపార్థాలు పెరుగుతాయి. మన మానవ సంబంధాలు దెబ్బతింటాయి. ్య విషయాలను, పరిస్థితులను సరిగా, సహేతుకంగా అర్థం చేసుకోలేకపోవడం. ్య మనుషుల పట్ల అనుసరిస్తున్న వైఖరిలో లోపం ఉంచటం. ్య సమాజం, జీవితం మీద ఏర్పరచుకొన్న దృక్పథంలో దోషాలు దొర్లడం. ్య నమ్మకాలు, విశ్వాసాలు అర్థం లేనివి, కాలం చెల్లినవి కావడం.