నీరసం తగ్గేందుకు..

ఆహారం-ఆరోగ్యం

To reduce lethargy
To reduce lethargy

శారీరక వ్యాయామం తక్కువ కావడం వల్ల శరీరంలో కొవ్వుపెరగడం, కండరాలు తగ్గిపోవడం జరుగుతుంది. సాధారణంగా వయసు పైబడిన వారికి రోజు వారి పనులు చేసుకోవడం కష్టంగా ఉంటుంది.

ముప్ఫై నుంచి అరవై యేళ్ల వారు తగిన జాగ్రత్తలు తీసుకుంటే కండరాల బలహీనత రాకుండా చూసుకోవచ్చు. ఆహారంలో ప్రొటీన్‌ అధికంగా ఉండేలా చూసుకోవాలి.

కండరాల నిర్మాణానికి ప్రొటీన్‌ ముఖ్య పోషకం. పప్పు దినుసులు, మాంసాహారం, గుడ్లు, చేపలను ఏదో ఒక పూట ఆహారంలో ఉండేలా చేసుకోవాలి.వే ప్రొటీన్‌ సప్లిమెంట్‌ కూడా తీసుకోవచ్చు.
విటమిన్‌ డి ఎములకలను దృఢంగా ఉంచుతుంది.

కండరాలు బలోపేతం అయ్యేందుకు ఉపయోగపడుతుంది. రోగనిరోధకశక్తిని పెంచుతుంది. గుడ్డు పచ్చసొనలో, పుట్టగొడుగుల్లో, ఆవునెయ్యి, వెన్న, నూనె పదార్థాల్లో ఉంటుంది.

విటమిన్‌ – డి సమృద్ధిగా లభించాలంటే ఉదయాన్నే 20 నిమిషాలు పాటు ఎండలో ఉండటం మంచిది. ఒమెగా కొవ్వులు తీసుకోవడం వల్ల శరీర కొవ్వుశాతం తగ్గుతుంది.

కండరాల గ్రోత్‌కు ఉపకరిస్తుంది. చేపలు, బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్‌లో ఒమెగ కొవ్వులు ఉంటాయి.

పొటీన్‌ను తీసుకుని సరైన రీతిలో ఉపయోగించుకోకపోతే కొవ్వుగా మారుతుంది. ప్రొటీన్‌ సరిగ్గా ఉపయోగపడాలంటే తగినంత వ్యాయామం చేయాలి.

వ్యాయామం వల్ల కండరాలు బలోపేతం అవుతాయి. కీళ్లలో రాపిడి తగ్గుతుంది. కండరాలు సాధారణ స్థితికి చేరుకుంటే కావలసినంత శక్తి లభిస్తుంది.

విటమిన్‌ – డి ఎముకలను, కండరాలు గట్టిపరుస్తుంది. ఒమెగా కొవ్వులు కండరాల పెరుగుదలకు ఉపకరిస్తాయి. ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కండరాలు బలహీతను దూరం చేస్తాయి.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/