పని సజావుగా సాగేందుకు…

Working
Working

పని ప్రదేశాల్లో నవ్వు- అనే విషయం మీద జరిపిన అధ్యయనాలు పనిగంటల్లో కనీసం పది నిమిషాలు హాస్యస్ఫోరక మాటలు, జోకులకు కేటాయించిన కంపెనీలు మంచి ఫలితాలను సాధించాయని చెబుతున్నాయి. పనిచేయకుండా అదేపనిగా నవ్వుతూ ఉండమని చెప్పటం ఇక్కడ ఉద్దేశం కాదుకానీ, కాస్త నవ్వు, ఉత్సాహం, ఉల్లాసం కలుపుకుంటే మీ ఆఫీసుపని సజావుగా సాగుతుంది మరి-

పనికి సంబంధించిన ఏ విషయమయినా టీమ్‌లోని ప్రతి ఒక్కరితో చర్చించండి. వివరాలు అందరికీ తెలిసేలా చూడండి. ప్రతిరోజు పని ప్రారంభించే ముందు టీమ్‌లోని సభ్యులందరూ కూర్చుని ఆరోజు చేయాల్సిన పని గురించి చర్చించుకోండి. ‘ఆడుతు,పాడుతు పనిచేస్తుంటే… అనే పాట వినే ఉంటారు. దానిని మీ పనిలోకి ఆహ్వానించండి. అదేపనిగా సీరియస్‌గా పనిచేస్తూపోతుంటే బుర్ర వేడెక్కిపోతుంది. అపుడపుడూ సందర్భాన్నిబట్టి హాస్యాన్ని ఆస్వాదించండి. పనిఒత్తిడి తెలియకుండా ఉంటుంది. ఎంత పనయినా అలవోకగా చేయగలుగుతారు.

నెలలో సాధించదలుచుకున్న లక్ష్యాన్ని చేరుకున్నందుకు, సహోద్యోగి పుట్టినరోజు, పెళ్ళిరోజు … ఇలా ఏదో ఒక సందర్భాన్ని బట్టి అందరూ కలిసి వేడుక చేసుకోవడంవల్ల టీమ్‌లోని సభ్యుల మధ్య మంచి అనుబంధాలు పెరుగుతాయి. ఆ ప్రభావం చేసే పనిమీద పడి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది.
రోజుమొత్తం ఆశావహదక్పథంతో ఉండేలా అలవాటు చేసుకోండి. ఆందోళన పనిచేసే శక్తిని తగ్గిస్తుంది. పనివిషయంలో వచ్చే సమస్యలను తోటివారితో చర్చించి, సమస్యకు ఉన్న అన్ని కోణాలను పరిశీలించి పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి.

తోటి ఉద్యోగస్తులకు, స్నేహితులకు సహాయం చేసే స్వభా వాన్ని పెంపొందించుకోండి. వారిని ఆందోళనకు గురిచేసే సందర్భా´లు, సమస్యలు వచ్చినపుడు మీరు కనీసం మాటసహాయం ద్వారానయినా కొంత ఉపశమనాన్ని ఇస్తున్నారన్న నమ్మకాన్ని వారికి కలిగేలా ప్రవర్తించండి.

ఉద్యోగజీవితానికి, కుటుంబజీవితానికి స్పష్టమయిన విభజన రేఖ గీసుకోండి. మీరు చేసే పనిని పూర్తిగా మీ సొంతవిషయంగా భావించి పూర్తి సమయాన్ని దానికే కేటా యించడం వల్ల కుటుంబజీవితం దెబ్బతినడమే కాకుండా, ఆరోగ్యం పాడయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రెండింటి మధ్య మంచి సమన్వయాన్ని సాధించడానికి ప్రయత్నించండి. బాగా ఒత్తిడితో గడిచిన రోజున పడుకునే ముందు చల్లటి నీటితో స్నానం చేసి, మంచి పుస్తకాన్ని చదువుతూ పడుకోండి. ఒక మంచి పుస్తకం మీ అలసటను పోగొట్టి మీ మెదడును చురుకుగా తయారుచేస్తుంది. పనిలో పడి విషయాలను మరచిపోకుండా ప్రతిరోజు మీరు చేయాల్సిన పనుల వివరాలు రాసి మీ దష్టి తరచుగా పడే ప్రదేశంలో ఆ కాగితాన్ని అతికించండి.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/