ప్రత్యేకంగా కనిపించాలంటే..

శిరోజాల సంరక్షణ

Hair Care

ప్రత్యేకంగా తయారవ్వాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అలాంటప్పుడు చకచకా మెరిసిపోయేలా సిద్ధంగా కావాలంటే చిట్కాలు పాటించాలి.

జుట్టు కళ తప్పినట్లు కనిపిస్తుంటే కప్పు గోరువెచ్చటి నీళ్లలో కాస్త వెనిగర్‌, రెండు చెంచాల తేనె కలిపి రాసుకోవాలి. గంటయ్యాక తలస్నానం చేయాలి.

ఇలా చేయడం వల్ల వెంట్రుకలు కాంతిమంతంగా మారతాయి. దాంతోపాటు ఉసిరి, శీకాయపొడిని రాత్రంతా నానబెట్టాలి.

మర్నాడు నీళ్లని వడకట్టి అందులో కాఫీ పొడి కలిపి మరిగించాలి. ఇలా మరిని నీళ్లను చలార్చి గోరింటాకు పొడిలో కలిపి తలకు పెట్టుకోవాలి. ఆ తరువాత తలస్నానం చేసి కండిషనర్‌ పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల జుట్టుకు హానిచేసే కారరాలు దూరమవుతాయి.

జుట్ట పట్టుకుచ్చులా మెరిసిపోతుంది. ఇంట్లోనే స్పా చికిత్స చేసుకున్న ఫలితం లభిస్తుంది. ముఖం ప్రత్యేకంగా అలంకరించుకోవడానికి ముందు ఆల్కహాల్‌ లేని క్లెన్సర్‌తో ముఖం తుడుచుకోవాలి. అలానే గులాబీ నీళ్లు, గ్లిజర్‌ిను కలిపి శుభ్రం చేసుకోవాలి.

ఇలా చేయడం వల్ల చర్మరంధ్రాలు తెరుచుకుంటాయి. అలానే పొడిచర్మం ఉన్నవారు లిక్విడ్‌ ఆధారిత మాయిశ్చరైజర్‌ రాయాలి. జిడ్డుచర్మతత్వం ఉన్నవారు నూనెలు లేని మాయిశ్చరైజర్‌ ఎంచుకోవాలి. అలానే పెరాక్సైడ్‌ క్రీమును రాసుకోవడం వల్ల మొటిమలు, బ్రేక్‌అవుట్స్‌ కనిపించవు.

వీటన్నింటితోపాటు సున్నిత, పొడిచర్మతత్వం ఉంటే పీల్స్‌ జోలికి వెళ్లకపోవడం మంచిది. కళ్లకింద నల్లమచ్చలు ఉన్నవారు ఆరెంజ్‌ ఆధారిత క్రీములు రాసుకోవాలి.

దీనివల్ల పిగ్మేంటేషన్‌ తగ్గి సమస్య దూరమవుతుంది. రాత్రిపూట ఐ మాస్క్‌లు ప్రయత్నించడం వల్ల ఫలితం ఉంటుంది. తరచూ కళ్ల కింద బాదం నూనెతో మర్దన చేయాలి.

ఇలా చేయడం వల్ల కనురెప్పల వెంట్రుకలు ఒత్తుగా పెరుగుతాయి. పెదాలు పొడిబారి పొట్టులా రాలిపోతుంటాయి. అలాంటప్పుడు ఆలివ్‌నూనెతో మర్దన చేసుకోవాలి.

లిప్‌స్టిక్‌ వేసుకోవడానికి ముందు లిప్‌బామ్‌ లేదా ఆలివ్‌ ఆయిల్‌ రాసుకోవడం వల్ల పెదాలు అందంగా కనిపిస్తాయి.

తాజా కెరీర్‌ సమాచారం కోసం :https://www.vaartha.com/specials/career/