మానసిక ఆందోళనకు దూరంగా..

Behappy form Mental Strain
To Avoid Mental Strain

రోజంతా పనితో మునిగితేలిన తరువాత ఉదయం ఉన్న ఉత్సాహం సాయంత్రానికి ఉండదు. దీనితోపాటు మనసుకు నచ్చని విషయాలు అదేపనిగా జరుగుతున్నపుడు మానసికాందోళన మొదలవుతుంది. ఎంతగా అందులో నుండి బయటపడదా మన్నా కొన్నిసార్లు వీలుకాదు. అలాంటపుడు ఇలా ప్రయత్నించి చూడండి.


ప్రతిరోజు ఉదయాన్నే లేచి కాసేపు ధ్యానం చేయండి.

మీ మనసులో కదలాడే ఆలోచనలన్నింటినీ ఒక డైరీలో రాసుకోండి. దీనివల్ల మానసిక ఒత్తిడి తగ్గి మనసు తేలికవుతుంది.

ప్రాణాయామం చేయడానికి ప్రయత్నించండి. ఇది మీకు చక్కటి ఏకాగ్రతను అందిస్తుంది. పైగా దీనికి ప్రత్యేక సమయం, ప్రదేశం అవసరం లేదు. ఉన్నచోటే కాస్త సౌకర్యవంతంగా కూర్చుని, కళ్లు మూసుకొని మీ శ్వాసపై ధ్యాస పెడితే చాలు.

కాసేపటికి ఆ ఉచ్ఛ్వాసనిశ్వాసల శబ్దం తప్ప ఏమీ వినిపించనంత ఏకాగ్రతలోకి వెళతారు. ఇది మానసికంగా ఎంతో ప్రశాంతతను అందిస్తుంది.

ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచు కోండి. లేదంటే అవి మీకు అసహనాన్ని కలిగించి కాస్త సమయం గడపాలన్నా ఎంతో ఇబ్బందిగా తోస్తుంది.

బాగా నవ్వండి, ఆనందాన్ని పంచుకోండి. అందుకు సంబంధించిన జ్ఞ్ఞాపకాలను నెమరు వేసుకోండి. అలాంటి నవ్వులు మీ మూడ్‌ను మారు స్తాయి. నిరాశను తరిమికొట్టి పనిలో పనిగా ఒత్తిడిని కూడా దూరం చేస్తాయి.

అప్పుడప్పుడూ కాస్త ప్రదేశం మారడానికి ప్రయత్నించండి. అంటే మొత్తం మకాం మార్చమని కాదు.

కాస్త మార్పుకోసం ఎక్కడికైనా కొత్త ప్రదేశాలకు వెళ్లడం, పాత మిత్రులను కలవడం, బంధువులు, శ్రేయోభిలాషులను కలుసుకోవడం, అందమైన ప్రదేశాలు సందర్శించి ఆ అను భూతులను అనుభవించడం లాంటివి.

ఇవికూడా మీ మూడ్‌ను మార్చి మీలో కొత్త చైతన్యానికి నాంది పలుకుతాయి. ఎన్నో తీపి జ్ఞాపకాలను మీ ఖాతాలో జమచేస్తాయి.

మీరు చేసే పనిలో పూర్తిగా మునిగిపోండి. అంటే దాన్ని ఎంజా§్‌ు చేస్తూ చేయండి. అలాంటి పద్ధతి మీకు అలవడితే ఇక మిమ్మల్ని చికాకు పెట్టే ఆలోచనలు అస్తమాను రావు.

ఇలా చేయడం వల్ల చేసే పనిలో కూడా మంచి ఫలితాలు సాధించే అవకాశం మెండుగా ఉంటుంది.

జాగింగ్‌, వ్యాయామం వంటి అలవాట్లకు ఎప్పుడూ దగ్గరగా ఉండండి. అవి కూడా ఒత్తిడిని తగ్గించి ఉత్సాహాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఆ ఉత్సాహం మీలో కొత్త చైతన్యాన్ని తెస్తుంది.