చిట్కాలు

పసిపిల్లకు అజీర్తి వ్యాధి కలగకుండా వారానికి మూడునాలుగు సార్లు ఓ స్పూన్‌ తేనెను తాగించాలి.

ఐస్‌లో పెట్టిన రొయ్యలు తాజాగా ఉండాలంటే వాటిని వెనిగ్‌ డ్రైవైన్‌ల మిశ్రమంలో ఉంచాలి.

మైనం కరిగించి మెత్తగా ఉన్నప్పుడే, అరికాళ్ల పగుళ్లకు పట్టిస్తే అది త్వరగా తగ్గుతుంది.

పసిపిల్లలకు జలుబు, దగ్గు తరచుగా రాకుండా ఉండాలంటే జాజికాయ అప్పుడప్పుడు అరగదీసం పిల్లల చేత కొద్ది కొద్దిగా నాకిస్తూ ఉండాలి.

ఖాళీ షాంపు ప్యాకెట్సు సబ్బు నీళ్లలో వేసి బట్టలు నానవేస్తే బట్టలు మంచి వాసన వేస్తూంటాయి.

పట్టు చీరలకు ఫాల్స్‌ కుట్టితే అంచులు నలిగిపోకుండా ముడతలు పడకుండా ఉంటాయి.

దుస్తులను ఇస్త్రీ పెట్టేటప్పుడు చల్లని నీటిని బట్టలపై చిలకరించడం అందరూ చేసేపని చల్లని నీటి బదులుగా గోరువెచ్చని నీటిని వాడితే ఇస్త్రీ కార్యక్రమం
త్వరగా అయిపోతుంది.

జార్జెట్‌, షిఫాన్‌ చీరెలు ఉతికితే ముడుచుకు పోతాయి. అలాంటి వాటిని తడిపి ఉతికిన వెంటనే రోకటికి చుట్టి ఒక్కొక్క పొరతీసి ఆరవేస్తే ఇస్త్రీ కూడా అవసరం ఉండదు.
పట్టుదుస్తులకు తుమ్మజిగురు గంజి మాదిరిగా పెడితే అవి మరికొంత కొత్తదనంగా బిరుసుగా ఉంటాయి.

నూనుబట్టలకి బ్లూ పెట్టేటప్పుడు, ఒక్కోచోట ఎక్కువగా అంటడం మరకలుగా ఏర్పడడం జరుగుతుంది. ఇవి పోవాలంటే పావ్ఞ బక్కెట్టు నీళ్లలో 5 లేక 6 చుక్కలు వెనిగరు వేసి, బట్టలు దానిలో ముంచి ఆరవేస్తే ఆ మరకలు ఇక కనిపించవు

బీరువాలో దుస్తులు చక్కటి వాసన రావాలంటే కర్పూరం బిళ్లల్ని మూలల్లో ఉంచండి మంచి వాసన వస్తుంది.

తాజా కెరీర్‌ సమాచారం కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/