చిట్కాలు చిన్నవే ..ప్రయోజనాలు అనేకం

మోకాలి నొప్పులనుంచి ఉపశమనం

Exercise

కూర్చోవాలన్నా, లేవాలన్నా, మెట్లు ఎక్కాలన్నీ, దిగాలన్నా మోకాలి నొప్పులు రాకుండా, ఛాతిలో నొప్పి లేకుండా ఉండాలన్నా, మొత్తంగా మెదడు ప్రశాంతంగా హాయిగా ఉండాలన్నా కొన్ని చిట్కాలు చాలంటున్నారు వైద్యులు.

రోజు ఉదయం, సాయంత్రం ఇరవై బింగీలు తీయాలి. దానివల్ల తొడలు బలపడడంతో పాటు మోకాలి నొప్పులు తగ్గుతాయి.

ఆకుపచ్చ అరటి పండ్లు తినడం. అందులోని ఫైబర్‌ వల్ల జీర్ణవ్యవస్థ బాగుంటుందని, అందులోని పొటాషియం వల్ల ఎముకలు బలపడతాయని బ్రిటిష్‌ డయాబెటిక్‌ అసోసియేషన్‌కు చెందిన డైటీషియన్‌ చెప్పారు.

అరటి పండ్లు పసుపు పచ్చగా మారినట్లయితే అందులోని ఫైబర్‌ నశించి పోతుంది. కాళ్ల మడమల వద్ద పట్టీలను ధరించాలి.

టివి చూస్తున్నప్పుడు రెండు కాళ్లకు వీటిని ధరించి ఒక కాలు తరువాత ఒక కాలును గాలిలోకి లేపి కాసేపు ఉంచి దించాలి.

ఇలా అయిదారు సార్లు చేస్తే కండరాలు బలపడి కాళ్ల నొప్పులు తగ్గుతాయి. నేలపై కూర్చొని ముందుకు కాళ్లను చాపి ఓ మోకాలి కింది భాగం నేలకు తాకేలా చేయాలి.

ఆ తర్వాత మరో కాలితో అలాగే చేయాలి. ఆ తర్వాత మోకాళ్లపై లేచి అలాగే కొద్దిసేపు నిలబడాలి. దానివల్ల మోకాళ్లు బలపడతాయి.

మెట్లు మునికాళ్ల మీద ఎక్కాలి. దానివల్ల మోకాలు కింద వెనుక బాగా ఉండే కండరాలు బలపడతాయంటున్నారు వైద్యులు.

ఉదయం బ్రష్‌ చేసేటపుడు ఓ కాలును వెనక్కి మడిచి ఒంటి కాలిపై కాసేపు నిలబడి, కాలు మార్చి మరో కాలిపై కాసేపు నిలబడితే కండరాల మధ్య స్నాయువుల ప్రభావం పెరిగి శరీరం బ్యాలెన్స్‌ను నిలబెడుతుంది.

గోరువెచ్చని నీళ్లలో రెండు అరచేతులను కాసుపు ఉంచి ఆ తర్వాత చేతులు కడుక్కోవాలి.

దానివల్ల చేతల వేళ్లు బలపడతాయి. క్రమంగా వేళ్ల నొప్పులు తగ్గుతాయి. వారానికి ఒకటి రెండు సార్లు టిఫిన్‌, లంచ్‌ వదిలేయాలి. దీనివల్ల గుండె పదిలంగా ఉండడమే కాకుండా కాస్త లావు తగ్గుతారు.

ప్రతిరోజు ఒకసారి బ్లాక్‌ లేదా గ్రీన్‌ టీ తాగడం మంచిది. రోజువారి తిండిలో ఉప్పును సాధ్యమైనంతగా
తగ్గించాలి.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/