శ్రీ మద్రామాయణము

SRI MADHRAMAYAN
SRI MADHRAMAYAN

నహిసత్యాత్‌ పరోధర్మ: – సత్యానికి మించిన ధర్మంలేదు.
ఇంతకూ సత్యమంటే ఏమిటి? వేదాంతులు ఏమేమో చెబుతారు. దాన్ని కొంతసేపు అలా ఉంచుదాం. అందరికీ అర్థమయేట్టు శాస్త్రాలు చెప్పేది ఒక్కటే – ఆడినమాట తప్పకు, వాగ్దానము చేస్తే తప్పక నెరవేర్చు. అది
రాజ్యాన్ని భరతునికిస్తాను, నేను అడవ్ఞలకు వెళతాను అని తండ్రి దశరథునకు చెప్పాడు. అడవ్ఞలకు వెళ్లాడు శ్రీరాముడు సీతా లక్ష్మణులతోసహా. భరతుడే స్వయంగా అక్కడికి వచ్చి అయోధ్యకు తిరిగివచ్చి రాజువ్ఞ కమ్మని బ్రతిమాలాడాడు. ఉహూ, తండ్రికిచ్చిన మాటకు కట్టుబడి ఉంటానన్నాడు శ్రీరాముడు. అంతకు ముందే తన తల్లి కౌసల్య చెప్పింది- ”పితృవాక్య పరిపాలన అంటూ అడవ్ఞలకు పోవద్దు. ఈ వృద్ధాప్యంలో నాకు సేవలు చేయడం కూడా పరమ ధర్మమే.. తండ్రి నీ కెట్లా పూజ్యుడో అట్లాగే తల్లిగా నేను కూడా పూజ్యురాలినేఅని. (పుట 134-సర్గఖ- అయోధ్యా కాండము శ్రీమద్రామాయణము – రామకృష్ణ మఠం) కానీ రాముడు తండ్రికిచ్చిన మాటకే కట్టుబడి ఉంటానన్నాడు. అందరూ చెప్పేది ఒక ఎత్తు సాక్షాత్తు కులగురువ్ఞ వశిష్ఠమహర్షి చెప్పేది మరొకటా? ఆయన ఏమంటాడో చూద్దాం- ” ఓ రామా! నేను నీకు, నీ తండ్రికి కూడా గురువ్ఞను. నువ్ఞ్వ నేను చెప్పినట్లు చేస్తే సత్పురుషుల మార్గాన వెళ్లిన వాడవవ్ఞతావ్ఞ. పండితులు, ఈ పరిషత్తు సభ్యులు, బ్రాహ్మణులంతా నీవారు వీళ్లందరినీ పరిపాలించడం ద్వారా కూడా నీవ్ఞ సత్పురుషుల మార్గాన నడిచినవాడవవ్ఞతావ్ఞ.
నీ తల్లి పెద్దదయి పోయింది. ఆమెకు శుశ్రూషలు చెయ్యడం నీ ధర్మం..
భరతుని ప్రార్థనలు మన్నించినట్లయితే నీవ్ఞ స్వధర్మాని అతిక్రమించినట్లు కాదు. ( పుట 274-111వ సర్గ- శ్రీమద్రామాయణము). వశిష్ఠ మహర్షి ఇంత చెప్పినా, ఆయనకు ఆయన గురువే అయినా, శ్రీరాముడు తన మనసు మార్చుకోలేదు. దీన్నంతా గమనిస్తే ఒక వేళ శ్రీరాముడు తండ్రికి కాక వేరే మరొకరికి ఏమైనా వాగ్దానం చేసింటే దాన్ని ఒదులుకోమని తండ్రి చెప్పింటే కూడా విని ఉండేవాడుకాడు, సత్యానికే కట్టుబడి ఉండేవాడని తెలుస్తుంది. అంటే తల్లి కన్నా, తండ్రికన్నా, గురువ్ఞకన్నా సత్యానికే విలువ ఇచ్చేవాడు శ్రీరామ చంద్రమూర్తి. రాజ్యం (సంపద) కన్నా వ్యక్తులు, బంధుత్వం ముఖ్యమని భరతుడు భావిస్తే, రాజ్యం కన్నా, వ్యక్తులకన్నా సిద్ధాంతాలు ముఖ్యమని శ్రీరాముడు భావించి ఆచరించాడు. అసలు హిందూమత
ప్రత్యేకతే అది వ్యక్తులకు కాక సిద్ధాంతాలకు ప్రాముఖ్యమివ్వటం అని స్వామి వివేకకానంద అంటారు. మనం శ్రీరామునికి గుడి కట్టించి ఆయనకు పూజిస్తాం కానీ ఆయన బోధను పట్టంచుకోం శ్రీ కృష్ణుని జయంతిని ఘనంగా జరుపుకుంటాం, కానీ ఆయన గీతను పారాయణానికి పరిమితం చేస్తాం. లేదంటే అత్యుత్సాహంగా పండుగ చేసుకొని మురిసిపోతాం. తల్లి, తండ్రి, గురువ్ఞ దైవసమానులే కానీ ధర్మాచరణకు, సత్యవ్రతాన్ని అవలంభించుటకు వారు అడ్డుపడినా వారినికాదని మున్మందుకు పోవలసిందే- నిజానికి ఇహంలోనూ, పరంలోనూ మనకు రక్షణనిచ్చే తల్లి తండ్రి, సోదరుడు, పత్ని, బంధువ్ఞలు ఎవరు? సత్యం మాతా పితాజ్ఞానం ధర్మోభ్రాతా దయ సఖా శాంతి: పత్ని క్షమా పుత్రష్పడేతే మమ బాంధవాః అలా భావించి జీవించారు కాబట్టే శ్రీరామ, శ్రీకృష్ణులు ఆరాధ్యదైవాలయ్యారు. ఇక మనవంతు కర్తవ్యం మిగిలింది. – రాచమడుగు శ్రీనివాసులు