యోగాతో వెన్నెముక నొప్పి నివారణ

Spinal Pain Relief With Yoga
Spinal Pain Relief With Yoga

మానవుని దేహానికి ”వెన్నెముకలే వెన్నెముక. మానవుని మెదడుకు శరీరాన్ని అనుపంధానించే 23 ఎముకల విచిత్ర నిర్మాణమే వెన్నెముక. నాడీమండలానికి రక్షణ కల్పించటానికి సృష్టికర్త వెన్నుపూస(వర్టెబ్రా) లనే ఇటుకలను ఒకటిపైనొకటి దొంతరులుగా పేర్చి నిర్మించాడు. అంతేకాక వెన్నెముక ఘర్షణ పడకుండా ప్రతీ రెండు వెన్నుపూసల మధ్యా స్పంజ్‌ వంఇ మృదువైన డిస్క్‌లను(ఇంట్రావర్టెబ్రాల్స్‌) ఏర్పాటు చేశాడు. మెడభాగంలో 7 పూసల(సర్వికల్‌ వర్టెబ్రా) ఉర:పంజర భాగంలో 12 పూసల(థోరాసిస్‌ వర్టెబ్రాక్‌), నడుము భఠాగంలో 5 పూసలు(లూబన్‌ వర్టెబ్రా) ఉంటాయి. అంబాక్‌లోని చివరి వెన్నుముక, ”త్రికము(సక్రమ్‌)పైన కూర్చొని ఉంటుంది. త్రికము, ముడిడ్పఊస ఎముక(కొకైక్స్‌)తోకల్సి తోకవంటి భాగాన్ని ఏర్పాటు చేస్తాయి. వెన్నెముక ,ఇవర, తుంటి ఎముక(ఫెల్విస్‌)ను కలుస్తుంది. మొండెమును మోసే తుంటి పిరుదులు ఆధారంగా ఉంటాయి.
వెన్నెముక ఒక కఠినమైన నిర్మాణం కాదు. వెన్నుపూసలు, డిస్క్‌ల చే నిర్మించబడి అన్ని పక్కలకు వంగటానికి అనువైన నిర్మాణం. మెడవద్ద, నడుము వద్ద వంపులు కల్గిన వయ్యారి వెన్నెముక కోమలంగా ఉండాలి. అంటే వెన్నెముకల మధ్యగల డిస్క్‌లు జారిపోవటంగానీ(డిజనెరెషనన్‌ ఆఫ్‌ డిస్క్స్‌)వాని నిర్మాణ రేఖ(అలైమెంట్‌) వక్రంగా గానీ జరుగకూడదు.
మెడకండరాలు, భుజకండరాలు, వెన్నెముకను పట్టి ఉంటే ఇతర కండరాలుచ నడుము వద్ద కండరాలు, పక్క కండరాలు, పొట్ట కండరాలు, పిరుదుల కండరాలు వీటన్నిటిపైనా ఆధారపడి ఉంటుంది. ”వెన్నెముక.
కనుక పైన పేర్కొనబడిన కండరాలన్నీంటినీ పటిష్ట పరచటం ద్వారా మాత్రమే ”వెన్నెముకను కాపాడవచ్చుననేది స్పష్టమౌతుంది. సూర్య నమస్కారాసనాలు అన్ని కండరాలను దృఢ పరుస్తూ, కీళ్ళ కదలికల్ని గరిష్ట స్థాయిలోకి తీసుకొని వచ్చి వెన్నెముక యొక్క అందాన్ని, మృదుత్వాన్ని కాపాడుతాయి. కొందరికి వెన్నుపాము పక్కకు తారాగిపోతుంది. ఇది వీపులోని ఒకే పక్క కండరాలు బిగుసుకు పోవటం వల్ల సంభవిస్తుంది. అన్ని కండరాలకూ సమంగా వ్యాయామాన్ని ఇవ్వటం ద్వారా దీన్ని నివారించవచ్చును. ”శశాంక భుజంగాసనాలు ఈ సమస్యకు ఉపశమనాన్ని. ”సుమేరు, అష్టాంగ దండాసనాల వలన వెన్నెముక మృదువుగా మారుతుంది. సూర్యనమస్కారములలోని చలనాసనాలు వెన్నెముకను మృదువుగా మారుస్తూ, కండరాలను తదితరాలను దృఢంగా మార్చగలవు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/